Prarthana Chabbria: 'చిరో' చిత్రంతో తెరపైకి...
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:52 PM
ట్రైనర్ గ్రేడ్ పైలట్‌గా పనిచేస్తున్న ప్రార్థనా చాబ్రియా ఇప్పుడు నటిగా తన సత్తా చాటుకోబోతోంది. తమిళ చిత్రం 'చిరో'తో ఆమె అరంగేట్రమ్ చేస్తోంది.
పైలట్ ప్రార్థనా చాబ్రియా నింగిని వీడి నేలపై అడుగు పెడుతున్నారు. అదీ చిత్రసీమలో కావడం విశేషం. ట్రైనర్ గ్రేడ్ పైలట్‌గా పనిచేసిన ప్రార్థనా చాబ్రియా ‘చిరో’ అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకల ముందుకు రానున్నారు. ఇదే యేడాది ఆ సినిమా విడుదల కానుంది. నటన పరంగా ఆదిశక్తి అనే యాక్టింగ్ స్కూల్ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ప్రార్థనా చాబ్రియా.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. విమానాలను నడిపిన పైలట్‌గా నిన్నటి వరకూ ఉన్న ఆమె నటిగా మారడం సినీ వర్గాలను ఆకర్షిస్తోంది.
ప్రార్థనా చాబ్రియా నటనతో పాటు పోల్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్‌లోనూ మంచి ప్రావీణ్యం పొందారు. దీంతో సంప్రదాయబద్ధమైన పాత్రలకు మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలను పోషించే సామర్థ్యం ఆమెకు ఉందని తెలుస్తోంది. అలాగే సింథి, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రార్థనా .. భవిష్యత్తులో పాన్ ఇండియా, సౌత్ ప్రాజెక్టులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ‘చిరో’ చిత్రం త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏవియేషన్ రంగం నుంచి నటన వైపు ప్రార్థనా చాబ్రియా చేస్తున్న ఈ ప్రయాణం, ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్న కొత్త నటీనటుల్లో ప్రత్యేకంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి:
హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్