'ఓం చాప్టర్ 1 – రుధిరం' మూడు రోజుల్లో రూ.13 కోట్ల గ్రాస్ వసూళ్లు!
ABN, Publish Date - Nov 23 , 2026 | 02:24 PM
మమ్ముట్టి, ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల నటించిన ‘ఓం చాప్టర్ 1 - రుధిరం’ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో రూ.13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
జాతీయ అవార్డు గ్రహీతలు మమ్ముట్టి, ధనుష్ కీలక పాత్రలు పోషించిన 'ఓం చాప్టర్ 1- రుధిరం' చిత్రం శుక్రవారం విడుదలైంది. సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రేణు దేశాయ్ మమ్ముట్టి భార్యగా నటించారు. 'అమరన్' సినిమాతో జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపును, విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాకు రచన చేసి దర్శకత్వం వహించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సినిమా తెలుగులో రూ. 13 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ విడుదల చేసింది.
ఈ మూవీకి వచ్చిన స్పందన గురించి సూర్యదేవర నాగవంశీ తెలియచేస్తూ, 'భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆసక్తికరమైన కథాంశం, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఆర్టిస్టుల అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రధానాంశాలుగా అభిమానులు, ప్రేక్షకులను మెప్పించాయి. కమర్షియల్ మాస్ సినిమాలకు ప్రేక్షకుల నుండి లభించే బలమైన ఆదరణతో వసూళ్లు మరింత పెరుగుతూ వస్తున్నాయి' అని అన్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, ఇంద్రాన్స్, చైతు జొన్నలగడ్డ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలను పోషించారని, సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం, ఆకట్టుకునే విజువల్స్, పాత్రలను ఎలివేట్ చేసిన విధానం ఈ చిత్రానికి మరింత బలంగా మారాయని ఆయన చెప్పారు. 'ఓం' చిత్రాన్ని వండర్బార్ ఫిల్మ్స్, ఆర్టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 101.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ స్వేచ్ఛా జీవితం ఇష్టం
Raashii Khanna: ఆ సినిమాలన్నీ.. గుడ్డిగా చేశా! ఇప్పుడు యాక్టింగ్పై శ్రద్ద పెట్టా
సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..