Raashii Khanna: ఆ సినిమాలన్నీ.. గుడ్డిగా చేశా! ఇప్పుడు యాక్టింగ్‌పై శ్రద్ద పెట్టా

ABN , Publish Date - Nov 23 , 2026 | 09:32 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడంపై హీరోయిన్ రాశీఖన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Rajinikanth Raashii Khanna

రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ధర్మన్ (Dharman) చిత్రంలో హీరోయిన్ రాశీఖన్నా (Raashii Khanna) నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె.. సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 'లొకేషన్‌లో రజనీకాంత్ నాకు ఫ్రెండ్‌గా మారిపోయారు.

ఆయనతో చాలా విషయాలు మాట్లాడాను. పలు ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టాను. ఆ విధంగా ఆయనతో కలిసి మెలిసి మెలిగాను. ఆయన సౌమ్యుడు. నిరాడంబరుడు. ఆయనతో ఉన్నపుడు నేను చిన్న పిల్లలా మారిపోయాను.

ఆయనతో లొకేషన్‌లో ఉండడం అమితంగా ఇష్టపడ్డాను. నా 13 యేళ్ళ అద్భుతంగా ఉంది. సినీ కెరీర్ ఆరం భంలో నాకు వచ్చిన సినీ అవకాశాలన్నింటినీ గుడ్డిగా ఎంపిక చేసుకున్నాను. ఇపుడు ప్రతి అవకాశానికి ఓకే చెప్పడం లేదు.

కథ నచ్చితేనే అంగీకరిస్తున్నాను. అభిమానులు కూడా ఏదో కొత్తగా ఎదురు చూస్తున్నారు. సో.. వారికి ఆకాంక్షలను నెర వేర్చేలా కథలను ఎంచుకుంటున్నాను. గతంలో కంటే ఇపుడు నటనపై ఎంతో శ్రద్ద చూపిస్తున్నా అని పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 09:42 AM