సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

ABN, Publish Date - Jul 02 , 2026 | 04:54 PM

పాన్-ఇండియా నిర్మాణ సంస్థగా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఈ సంస్థ నాల్గవ తమిళ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.

Mythri Dhruv Movie Launch

పాన్-ఇండియా నిర్మాణ సంస్థగా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ (Mythri Movie Makers).. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఈ సంస్థ నాల్గవ తమిళ చిత్రాన్ని (MythriTamil04) అధికారికంగా ప్రకటించింది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా నటిస్తోన్న ఈ మూవీ అతనికి కూడా నాల్గవ చిత్రం కావడం విశేషం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ (Karan Arvind Kumar) దర్శకుడు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుని అధికారికంగా ప్రారంభమైంది.


చెన్నైలోని MRC నగర్‌ మైత్రీ ఆఫీస్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌ కొట్టగా.. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరై.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్‌ పూర్తిగా మాస్-ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ప్రయోగాలు చేసే హీరోగా పేరు తెచ్చుకున్న ధృవ్.. ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందనున్న ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధమయ్యారు. కరణ్ అరవింద్ కుమార్, సబీతో కలిసి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని వికీ నిర్వహించనుండగా, జయసూర్య ఎడిటర్‌. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ జి.ఎం. శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ బాధ్యతలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

‘జాంబి రెడ్డి 2’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. దర్శకుడెవరో తెలుసా?

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

Updated Date - Jul 02 , 2026 | 04:54 PM