‘జాంబి రెడ్డి 2’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. దర్శకుడెవరో తెలుసా?

ABN , Publish Date - Jul 01 , 2026 | 10:14 PM

ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కే సినిమాల లిస్ట్ చెబుతూ.. ‘జాంబిరెడ్డి’ సీక్వెల్, ‘మిరాయ్’ సీక్వెల్ ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించుకున్నట్లుగా తెలుస్తోంది.

Zombie Reddy 2 Update

ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కే సినిమాల లిస్ట్ చెబుతూ.. ‘జాంబిరెడ్డి’ (Zombie Reddy) సీక్వెల్, ‘మిరాయ్’ (Mirai) సీక్వెల్ ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ‘జాంబి రెడ్డి 2’ (Zombie Reddy 2) అయితే మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ మొదలవుతున్నా... నిర్మాతలు భారీగా హంగామా చేస్తున్నారు. అందులోనూ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే.. ఎంతో కొంత హంగామా అయినా చేసి ఉండాలి. అలాంటిదేమీ లేకుండా సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ చేయడానికి కారణం ఏమై ఉంటుందో ఆ నిర్మాతకే తెలియాలి.


అలాగే ఈ సీక్వెల్ దర్శకుడు కూడా మారినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబి రెడ్డి’ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడీ సీక్వెల్‌ను బాలీవుడ్ దర్శకుడు హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన సుపర్ణ్ వర్మ (Suparn Varma). కథ మాత్రం ప్రశాంత్ వర్మదే.. కానీ దర్శకత్వం మాత్రం ఈ బాలీవుడ్ దర్శకుడు చేస్తుండటంతో.. అనేకానేక అనుమానాలు వ్యక్తమవడం మాములే. ప్రశాంత్ వర్మ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు, సుపర్ణ్ వర్మ మేకింగ్ తోడవనుండటంతో.. ఈ సీక్వెల్‌పై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.


ఇక పార్ట్ 1లో తేజ సజ్జా (Teja Sajja) సరసన ఆనంది నటించగా, ఈ పార్ట్ 2లో మాత్రం ఓ బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవును, ఈ సీక్వెల్‌తో టాలీవుడ్‌కు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ (Shanaya Kapoor) పరిచయం కాబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి పలువురు భామలు టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు షనాయా కపూర్ కూడా చేరింది. మొదటి షెడ్యూల్ పూర్తయిందనే అప్డేట్‌తో ప్రస్తుతం ఈ సినిమా వార్తలలో బాగా హైలెట్ అవుతోంది. మొదటి భాగం కంటే మరింత భారీ బడ్జెట్‌తో, సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ హారర్-కామెడీ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

Updated Date - Jul 01 , 2026 | 10:14 PM