సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మణిరత్నం కొత్త సినిమా టైటిల్ ఇదే.. భలే గమ్మత్తుగా ఉంది కదా

ABN, Publish Date - Sep 07 , 2026 | 07:57 PM

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం హిట్ అందుకొని చలా ఏళ్లు అవుతుంది. పొన్నియన్ సెల్వన్ తరువాత కమల్ హాసన్ తో థగ్ లైఫ్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ.. వివాదాలతో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది.

Inji Vellam

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Manirathnam) హిట్ అందుకొని చాలా ఏళ్లు అవుతుంది. పొన్నియన్ సెల్వన్ తరువాత కమల్ హాసన్ తో థగ్ లైఫ్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ.. వివాదాలతో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. అసలు మణిరత్నమేనా ఇలాంటి సినిమా తీసింది అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ ఇప్పుడు హిట్ కోసం కష్టపడుతున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈసారి తనకు అచ్చి వచ్చిన లవ్ స్టోరీని తెరకెక్కించి గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి మణిరత్నం సిద్ధమయ్యాడు.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో మణిరత్నం ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెల్సిందే. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఇంజి వెల్లమ్ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో విజయ్ సేతుపతి- సాయి పల్లవి చాలా రొమాంటిక్ గా కనిపించారు.


తన మార్క్ మ్యాజికల్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో, చారిత్రాత్మక హౌరా బ్రిడ్జ్ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి చేశారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవిల క్లాసిక్ కాంబినేషన్ ఎ.ఆర్. రెహమాన్ అందించే మ్యూజిక్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఇంజి వెల్లమ్ అంటే తెలుగులో అల్లం నీళ్లు. ఇక ఈ టైటిల్ చూసి ఫ్యాన్స్ భలే గమ్మత్తుగా ఉందే టైటిల్ అని చెప్పుకొస్తున్నారు. మణిరత్నం మునుపటి క్లాసిక్స్ సఖి, ఓకే బంగారం తరహాలో ఈ ఇంజి వెల్లమ్ కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమకావ్యంగా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. మరి అల్లం నీళ్లు మణిరత్నం కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Sep 07 , 2026 | 08:15 PM