సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అలాంటి పాత్రలతో అలరించాలని ఉంది: లిజీ ఆంటోనీ

ABN, Publish Date - Jul 08 , 2026 | 07:21 PM

15 యేళ్ళకు పైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న లిజీ ఆంటోనీ తాజాగా విష్ణు విశాల్‌ నటించిన ‘గట్టా కుస్తీ-2’ చిత్రంలో పంచాయతీ అధ్యక్షురాలి పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Lizzie Antony

తన వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉండే హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాలన్నదే తన కోరిక అని నటి లిజీ ఆంటోనీ (Actress Lizzie Antony) అంటున్నారు. 15 యేళ్ళకు పైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న లిజీ ఆంటోనీ తాజాగా విష్ణు విశాల్‌ (Vishnu Vishal) నటించిన ‘గట్టా కుస్తీ-2’ (Gatta Kusthi 2) చిత్రంలో పంచాయతీ అధ్యక్షురాలి పాత్రలో నటించి మెప్పించారు. ఆమె పోషించిన ఈ పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో లిజీ ఆంటోనీ మీడియాతో ముచ్చటిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘నా 15 యేళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నాను. కఠోర శ్రమ, పట్టుదల, ఓర్పు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నాకు వచ్చిన ప్రతి పాత్ర ఎంతగానో ఇష్టపడి చేశాను. కానీ హాస్యం, వ్యంగ్య పాత్రల్లో చేయడం ఎంతో ఇష్టం. ఆ అవకాశాన్ని కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా, రోటీన్‌గా వచ్చే పాత్రలను చేయడానికి నేను ఏమాత్రం ఇష్టపడను. అందుకే రెండు చిత్రాలు వరుసగా చేసిన తర్వాత మూడో చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్ర ఎంచుకుంటున్నాను. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ, ఆ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో నిరాకరించాను’’ అని పేర్కొన్నారు.


‘తూంగానగరం,’ ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’, ‘గట్టాకుస్తీ’, ‘బ్లూస్టార్‌’, ‘బొమ్మై నాయకి’ వంటి అనేక హిట్‌ చిత్రాల్లో నటించిన లిజీ ఆంటోనీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘లక్ష్మీకాంతన్‌ కొలై వళక్కు’, ‘వేట్టువం’ వంటి చిత్రాల్లో నటించగా, అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లుగా ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఆ దర్శకుడితో రెండో పెళ్లి.. షాకిచ్చిన కలర్స్ స్వాతి

భాగ్యరాజ్‌ను ఐస్‌ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్

VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...

Updated Date - Jul 08 , 2026 | 07:21 PM