ఆ దర్శకుడితో రెండో పెళ్లి.. షాకిచ్చిన కలర్స్ స్వాతి

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:20 PM

గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల వార్తలకు ఎట్టకేలకు చెక్ పెడుతూ.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ‘కలర్స్’ స్వాతి సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. రెండో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుపుతూ ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Swathi Reddy weds Srikanth Nagothi

గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల వార్తలకు ఎట్టకేలకు చెక్ పెడుతూ.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ‘కలర్స్’ స్వాతి (Swathi Reddy) సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతి (Srikanth Nagothi)ని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వాతి స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన ఒక అందమైన ఫోటోను పంచుకుంటూ, దానికి ‘Hitched.. 08-07-2026’ అని క్యాప్షన్ జోడించారు. పవిత్రమైన హోమం సాక్షిగా శ్రీకాంత్ చేతిని స్వాతి పట్టుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


స్వాతి గతంలో 2018లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తన విడాకుల రూమర్లపై స్వాతి ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇన్‌స్టాగ్రామ్ నుండి తన భర్త ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి నటనపై దృష్టి పెట్టి, శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.


ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీకాంత్, స్వాతి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు దారితీసిందని ఇండస్ట్రీ టాక్. అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా జరిగిపోయిన ఈ పెళ్లి వార్త చూసి అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాకవుతున్నారు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి, కొత్త భాగస్వామితో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నూతన దంపతులకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

భాగ్యరాజ్‌ను ఐస్‌ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్

VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

Updated Date - Jul 08 , 2026 | 06:44 PM