సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘తలైవర్‌’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్‌

ABN, Publish Date - Aug 29 , 2026 | 12:25 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఒక్కసారి కళ్లారా చూస్తేనే చాలని అనుకుంటారు. అలాంటిది సాక్షాత్తూ ‘తలైవర్’ పక్కన కూర్చుని విమానంలో ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్ దక్కితే? ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే.

Kayadu Lohar with Rajinikanth

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth)ను ఒక్కసారి కళ్లారా చూస్తేనే అభిమానులు పరవశించిపోతారు. అలాంటిది సాక్షాత్తూ ‘తలైవర్’ పక్కన కూర్చుని విమానంలో ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్ దక్కితే? ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి అపురూపమైన అనుభవమే ఎదురైంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్‌ (Kayadu Lohar)కు. ఇటీవల చెన్నై నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూర్చున్నారు. ఈ ఊహించని మధుర క్షణాన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేనంటూ రజనీకాంత్‌తో దిగిన అందమైన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఈ సందర్భంగా కయాదు లోహర్ ఎంతో భావోద్వేగంతో స్పందిస్తూ.. ‘‘ఒక వీరాభిమానికి విమానంలో రజనీకాంత్ గారి పక్కన కూర్చునే అద్భుతమైన అవకాశం లభించింది. నిజంగా ఇది జరిగిందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన్ను చూడగానే నా మనసులో ‘సుందరి కన్నాళ్ ఒరు సేది’ (‘దళపతి’ చిత్రంలోని పాట) మ్యూజిక్ మోగడం మొదలైంది. ఒక్క క్షణం నేను కలల లోకంలో తేలిపోయాను. ఎంతటి అపురూపమైన, మధురమైన క్షణం ఇది! ఈ ఒక్క సంఘటనతో నా రోజంతా పరిపూర్ణమైపోయింది. భవిష్యత్తులో ఎప్పటికైనా రజనీకాంత్ గారితో కలిసి వెండితెరపై నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.


ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్రాగన్’ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్, ఆ తర్వాత ‘ఇదయం మురళి’ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘ఇమ్మోర్టల్’, ‘మంజణతి’, ‘సూర్య 48’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగులో నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న పాన్-వరల్డ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. కెరీర్ పరంగా వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న కయాదుకు, సాక్షాత్తూ తలైవర్‌తో దక్కిన ఈ విమాన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమొరీగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా

Nayantara: మనిషి మారినా దక్కని విజయం!

హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

Updated Date - Aug 29 , 2026 | 12:25 PM