‘విక్రమ్‌’లో రోలెక్స్ పాత్ర ఆ హీరో చేయాల్సింది: కమల్ హాసన్

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:08 PM

సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘విక్రమ్’ సినిమా వచ్చి ఇంతకాలం అవుతున్నా.. అందులోని ‘రోలెక్స్’ పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.

Kamal Haasan on Rolex Role

సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘విక్రమ్’ (Vikram) సినిమా వచ్చి ఇంతకాలం అవుతున్నా.. అందులోని ‘రోలెక్స్’ (Rolex) పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. సినిమా చివరిలో.. కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే ఆ పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో స్టార్ హీరో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించారు. అయితే, ఈ ఐకానిక్ రోల్‌కు సంబంధించి తాజాగా కమల్ హాసన్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ పాత్ర కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మొదటి ఛాయిస్ సూర్య కాదని, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.


Big-B.jpg

మొదట ఆ పాత్రను అమితాబ్ బచ్చన్‌(Amitabh Bachchan) తో చేయించాలని అనుకున్నప్పటికీ, పలు సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాతే ఆ పాత్ర సూర్య (Suriya) దగ్గరికి వెళ్ళిందని కమల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన చర్చ మొదలుపెట్టారు. ఒకవేళ నిజంగానే అమితాబ్ బచ్చన్ ఆ పాత్ర చేసి ఉంటే.. సూర్య ఇచ్చినంత మాస్ హై, క్రూరత్వం ఆ పాత్రకు వచ్చేది కాదేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సూర్య తన రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో ‘రోలెక్స్’ పాత్రను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారని అంటున్నారు.


ఏది ఏమైనప్పటికీ, ఆ పాత్రకు సూర్యనే యాప్ట్ అండ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని, చిత్రయూనిట్ చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకే మైలేజ్ తెచ్చిపెట్టిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్య ఆ పాత్రను ఒప్పుకోవడం వల్లే ‘లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో రోలెక్స్ క్యారెక్టర్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ‘రోలెక్స్’ పాత్రని హైలెట్ చేస్తూ.. లోకేష్ కనుక సూర్యతో సినిమా చేస్తే మాత్రం.. ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సూర్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Updated Date - Jun 25 , 2026 | 10:08 PM