జయరామ్ - సిమ్రాన్ పెళ్లి.. ఏం చిల్లరగాళ్లున్నార్రా
ABN, Publish Date - Aug 24 , 2026 | 04:07 PM
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుకార్లు ఏ స్థాయిలో షికారు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో, హీరోయిన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించినా లేదా కాస్త దగ్గరగా మాట్లాడినా చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు అల్లేస్తుంటారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుకార్లు ఏ స్థాయిలో షికారు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో, హీరోయిన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించినా లేదా కాస్త దగ్గరగా మాట్లాడినా చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు అల్లేస్తుంటారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసమే కొందరు చేసే ఈ తప్పుడు ప్రచారాలు ఒక్కోసారి సెలబ్రిటీలను కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నటుడు జయరామ్ (Jayaram), సీనియర్ నటి సిమ్రాన్(Simran) ల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
మెడలో పూలదండలు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న జయరామ్, సిమ్రాన్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ వైట్ పంచెల జయరామ్, రెడ్ కలర్ పట్టుచీరలో సిమ్రాన్.. మెడలో దండలతో కనిపించడంతో ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. ఇంకొందరు అయితే ఏకంగా శుభాకాంక్షలు చెప్పడం, పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్పుకొస్తున్నారు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు వారి పర్సనల్ లైఫ్ ని దెబ్బతీస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ ఫోటోల్లో ఉన్నది నిజంగానే జయరామ్, సిమ్రాన్ అయినప్పటికీ.. వారు పెళ్లి చేసుకున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే, ఇటీవల వీరిద్దరూ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఒక నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన జయరామ్, సిమ్రాన్‌లకు చిత్ర నిర్మాణ సంస్థ పూలదండలు వేసి గౌరవంగా సత్కరించింది. ఆ సమయంలో తీసిన ఫోటోలనే కొందరు అల్లరిమూకలు సోషల్ మీడియాలో జయరామ్ - సిమ్రాన్ రహస్య వివాహం అంటూ ప్రచారం చేశారు. దీంతో సినిమా ఓపెనింగ్ వేడుకను కాస్తా పెళ్లి ఫోటోలుగా మార్చేసి రూమర్లు పుట్టించారని స్పష్టమైంది. ఇక ఈ విషయం తెలియడంతో.. నెటిజన్స్.. ఏం చిల్లరగాళ్లున్నార్రా సోషల్ మీడియాలో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.