నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు
ABN, Publish Date - Aug 10 , 2026 | 03:57 PM
నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ అన్నారు.
నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) అన్నారు. సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్ నిర్మించిన ‘సిగ్మా’ (Sigma) చిత్రంతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను జాసన్ సంజయ్ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో.. తన గురించి ఇంటిలోని వారు ఎలా ఆలోచిస్తున్నారో జాసన్ సంజయ్ తెలిపారు.
ఈ సందర్భంగా జాసన్ సంజయ్ మాట్లాడుతూ.. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను. కానీ, మా అమ్మ ఇంకా నన్ను చిన్నపిల్లవాడిగానే చూస్తోంది. నా పనుల్లో బిజీగా ఉండటంతో ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. కానీ, ఆమె మాత్రం పదేపదే ఫోన్ చేసి.. టైమ్‌కి తిన్నానా, లేదా? అని నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా నేను పని ఒత్తిడితో నీరసించి పోతే ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తారు. సినిమా విషయంలో ఆమె అభిప్రాయాలు, సలహాలను గౌరవిస్తాను. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత అమ్మ చేసే కామెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను.
ఇక నాన్న విషయానికి వస్తే.. నా విషయంలో నాన్న పూర్తి స్వేచ్ఛనిచ్చారు. విదేశాలకు వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తానని చెప్పగా ఆయన సమ్మతించారు. అలాగే, సినిమాలోని అనేక శాఖలపై పట్టు సాధించేందుకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ‘సిగ్మా’ స్టోరీ లైన్ కూడా నాన్నకు తెలుసు. మొదటి నుంచి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటడమే కాకుండా, చాలా స్వేచ్ఛనిచ్చారు. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత నాన్న అభిప్రాయం కోసం కూడా వేచి చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే
ఫ్యాన్స్ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..
బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల