సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విశాల్ గురించి ఈ విషయం తెలుసా..

ABN, Publish Date - Jul 25 , 2026 | 02:59 PM

హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘మకుటం’. ఈ సినిమా గురించి తెలుపుతూ.. విశాల్ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.

Vishal and Vijay

గతంలో పలు చిత్రాలకు ఘోస్ట్‌గా దర్శకత్వం వహించానని, ఆ చిత్రాల పేర్లను ఇప్పుడు వెల్లడించలేనని హీరో విశాల్‌ (Hero Vishal) అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘మకుటం’ (Makutam). సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ మూవీలో విశాల్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా విశాల్ తెలియజేశారు.


‘‘గతంలో పలు చిత్రాలకు ఘోస్ట్‌గా దర్శకత్వం వహించా. అయితే, ‘మకుటం’ చిత్రంలోనే తొలిసారి దర్శకుడిగా నా పేరు టైటిల్‌ కార్డులో కనిపించనుంది. నేను దర్శకుడు కావాలనే లక్ష్యంతో సినిమాల్లోకి రాలేదు. ఏళ్లపాటు సహాయ దర్శకుడిగా పనిచేశా. నా వద్ద హీరో విజయ్‌ (Hero Vijay) కోసం సిద్ధం చేసిన పలు స్టోరీలు ఉన్నాయి. కానీ, నేను అనుకోకుండా యాక్టరయ్యాను. భవిష్యత్‌లో ఎలాంటి జర్నీ చేస్తాననేది ఇప్పుడప్పుడే చెప్పలేను.


ఇక ‘మకుటం’ సినిమా గురించి చెప్పాలంటే.. మధ్య తరగతి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వారిలో ఒకరు వైద్యుడు, రెండో వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌, మూడో వ్యక్తి ఇళయరాజా వీరాభిమాని. ఈ మూడు పాత్రలు విలక్షణంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లేలో చిన్న చిన్న మార్పులు చేశాం. క్లైమాక్స్‌లో చివరి పది నిమిషాలు ఉత్కంఠభరితంగా ఉంటుంది. మాస్‌ కమర్షియల్‌ చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కథ 1960, 1990, 2025 అనే మూడు కాలాల్లో జరుగుతుంది. శాంతియుతమైన ప్రపంచం, గ్యాంగ్‌స్టర్ల ప్రపంచం ఢీ కొంటే ఏం జరుగుతుంది? ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అనేదే ఈ చిత్ర కథ’’ అని విశాల్ వివరించారు. ఇక ‘మకుటం’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

కేంద్రమంత్రి రాజీనామా చేయాలి: నటి జ్యోతిక సంచలన పోస్ట్

విద్యార్థుల ఆందోళన.. సీఎం విజయ్‌కు కనిపించడం లేదా?: దర్శకులు

బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే

Updated Date - Jul 25 , 2026 | 02:59 PM