స్క్రిప్ట్ రెడీ.. డ్యూడ్ మాట కోసం వెయిటింగ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:28 PM
లవ్ టుడే సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).
లవ్ టుడే సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇక ఈ సినిమా తరువాత దర్శకుడిగా కాకుండా హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. డ్యూడ్, డ్రాగన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ప్రదీప్ కి LIK సినిమా బ్రేక్ వేసింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పరాజయం పాలయ్యింది. దీని తరువాత ప్రదీప్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఇకపోతే ప్రదీప్ - కీర్తీశన్ కాంబోలో వచ్చిన డ్యూడ్ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కీర్తీశన్ మాట్లాడుతూ.. డ్యూడ్ సీక్వెల్ స్క్రిప్ట్ రాసాను.. దాన్ని ప్రదీప్ కి కూడా వినిపించాను. ఆయన ఓకే అనగానే సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుంది.. ఇందులో మొదటి భాగం కంటే డబుల్ రేంజ్‌లో కామెడీ, ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ .. ప్రదీప్ ని డ్యూడ్ సీక్వెల్ కి ఓకే చెప్పమని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రదీప్ డ్యూడ్ సీక్వెల్ ని హోల్డ్ లో పెట్టడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కథ నచ్చక ఇంత సమయం తీసుకున్నాడా.. ? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. ? అని తెలియాల్సి ఉంది. నిజం చెప్పాలంటే డ్యూడ్ సినిమాను డైరెక్టర్ హ్యాపీగానే ముగించాడు. దీనికి సీక్వెల్ అంటే ఎలాంటి స్టోరీ లైన్ ఉంటుంది.. ? లేక మొదటి పార్ట్ కి రెండో పార్ట్ కి సంబంధం లేకుండా ఉంటుందా.. ?.. కీర్తీశన్ ఏ యాంగిల్ లో సీక్వెల్ రాశాడు అని నెటిజన్స్ ఊహాగానాలు అల్లుతున్నారు. మరి ప్రదీప్ ఈ సీక్వెల్ కి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు