సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

ABN, Publish Date - Nov 07 , 2026 | 10:32 AM

తమిళ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలోని ధనుష్ స్పీచ్ వైరల్ అవుతోంది.

Dhanush OM Pre Release Event

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓం’ (OM - Chapter 1: Udhiram). మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ ప్రీ-రిలీజ్, ఆడియో లాంచ్ (OM Pre Release Event) వేడుక శుక్రవారం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ చేసిన భావోద్వేగ, పవర్‌ఫుల్ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల తనపై వస్తున్న పుకార్లు, వ్యక్తిగత విమర్శలపై ధనుష్ సూటిగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు (Dhanush Speech). ‘‘ఇటీవలి కాలంలో నా పేరు చుట్టూ చాలా రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన వెనుక ఎవరో ఉన్నారు, ఆయనే నడిపిస్తున్నారు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నా వెనుక ఉన్నది ఏ మనుషులు కాదు.. దేవుడు, నా అభిమానులు, నాతో నిలబడే ప్రజలు మాత్రమే ఉన్నారు’’ అని కుండబద్దలు కొట్టారు. తనను ఎప్పుడూ తక్కువగా చూసేవారికి సమాధానమిస్తూ.. ‘‘నా జీవితమంతా నన్ను నేను ఓ అండర్‌డాగ్‌గానే భావిస్తాను. నన్ను నిరంతరం తక్కువగా అంచనా వేస్తుంటారు, ట్రోల్ చేస్తుంటారు. కానీ వాళ్లు నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. నాలో అంతగా కసి, ప్రేరణ పెరుగుతాయి. అండర్‌డాగ్‌గా ఉంటూ సాధించే విజయాల్లో ఉండే కిక్కే వేరు’’ అని ధనుష్ వ్యాఖ్యానించారు.


ఇదే క్రమంలో అభిమానులకు ఆయన ఒక బాధ్యతాయుతమైన విన్నపం చేశారు... ‘‘నా అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నా పేరు మీద మీ సొంత డబ్బులతోనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప నేను నా జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి.. మీ కుటుంబ అవసరాలు తీరి, మీ దగ్గర మిగిలి ఉన్నప్పుడే సేవ చేయండి. కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి మాత్రం ఏమీ చేయకండి’’ అని హితవు పలికారు. అంతేకాకుండా, రాబోయే నవంబర్ ఆఖరు, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఒకవేళ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి అభిమానులంతా ముందుండాలని పిలుపునిచ్చారు.

సినిమా విశేషాలను పంచుకుంటూ ‘ఓం’ చిత్రాన్ని ఒక మల్టీ హీరో సినిమాగా ఆయన అభివర్ణించారు. ఇందులో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, 22 ఏళ్ల యువ సంచలన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో పాటు తాను మరో హీరోగా ఉన్నానని తెలిపారు. తనపై, కథపై దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి ఉన్న నమ్మకం అసాధారణమైనదని ప్రశంసించారు. ఇక సినిమాలో ‘అలాకా లూవా’ పాట వెనుక జరిగిన సరదా సంఘటనను ధనుష్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ పాటను మొదట నేను పాడలేనని చెప్పినా దర్శకుడు, సంగీత దర్శకుడు బలవంతం చేసి మూడున్నర గంటల పాటు పాడించారు. తీరా రికార్డింగ్ పూర్తయ్యాక.. ఆ పాటను సాయి అభ్యంకర్ పాడితేనే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. నా సినీ కెరీర్‌లోనే నేను పాడిన ఒక పాటను రికార్డింగ్ తర్వాత తొలగించడం ఇదే మొదటిసారి’’ అంటూ నవ్వులు పూయించారు.


మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి గురించి మాట్లాడుతూ.. ఆయన నిజ జీవితంలో ఓ రౌడీలా కనిపిస్తూ ఎంతో సరదాగా ఉంటారని, బయటకు గంభీరంగా కనిపించినా ఆయన మనసు ఎంతో సున్నితమైనదని, గొప్ప హాస్యప్రియుడని ధనుష్ కొనియాడారు. చివరగా, ‘‘మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి.. నా ఆలోచనల్లో నిరంతరం మీరే ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులంతా జాగ్రత్తగా తమ ఇళ్లకు చేరుకోవాలి’’ అని ధనుష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ధనుష్ స్పీచ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

మూస పాత్రలు నా వల్ల కాదు.. నా లక్ష్యమిదే: రెజీనా

నాన్నను కోల్పోయినంత బాధగా ఉంది: వివి వినాయక్

‘టైసన్ నాయుడు’ ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అదిరింది

Updated Date - Nov 07 , 2026 | 10:37 AM