ధనుష్‌ ‘ఓం’ శేషాచలం ఎన్‌కౌంటర్ కథేనా?

ABN , Publish Date - Oct 27 , 2026 | 02:19 PM

ధనుష్‌ నటిస్తున్న ‘ఓం’ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. సాయిపల్లవి పోలీస్ అధికారిణిగా కనిపించిన గ్లింప్స్‌తో ఈ సినిమా 2015 శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటన ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం మొదలైంది.

Dhanush Om Movie

తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఓం' నవంబర్ 20న విడుదల కాబోతోంది. ఇందులో సాయిపల్లవి పోలీస్‌ అధికారిణిగా కీలక పాత్రను పోషించింది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైన తర్వాత తమ అనుమానం నిజం కాబోతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గతంలో వచ్చిన ప్రచార చిత్రాలను సునిశితంగా గమనించిన వారు ఇది దాదాపు పుష్కర కాలం క్రితం చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. 2015 ఏప్రిల్‌ 7న శేషాచలం అడవుల్లో ఎర్రచందనంను అక్రమ రవాణా చేస్తున్న తమిళ కూలీలకు, ఏపీ పోలీస్‌లకు మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. తమిళ స్మగ్లర్లు కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇనపరాడ్లతో తమపై దాడి చేశారని, గత్యంతరం లేక తాము కాల్పులు జరిపామని, అందులో ఇరవై మంది స్మగ్లర్లు చనిపోయారని పోలీసు అధికారులు పేర్కొన్నారు.


అయితే ఆ సమయంలో మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం పోలీసులు చెప్పే మాటలను నమ్మలేమని, చనిపోయిన వ్యక్తులను తీవ్రంగా హింసించి, హత్య చేసినట్టుగా ఉందని ఆరోపణ చేశారు. అతి దగ్గరగా వారిని కాల్చి చంపిన గుర్తులు ఉన్నాయని తెలిపారు. అడవుల నుంచి వెళ్ళిపోతున్న వ్యక్తులను బస్సుల నుంచి బయటకు లాగి హత్య చేశారని మరికొందరు తెలిపారు. ఆ రోజున చంద్రగిరి మండలంలోని శేషా చలం అటవీ ప్రాంతంలోని ఈటగుంట లో తొమ్మిది మంది కూలీలు ఎన్ కౌంటర్‌లో చనిపోగా, వాచిండౌ బండలో పదకొండు మంది మృతి చెందారు. దాదాపు 500 మంది కూలీలతో ఎర్రచందనం స్మగ్లర్లు చెట్లు నరికిస్తుండగా ఈ ఎన్ కౌంటర్‌ జరిగిందని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్) ఆర్.పి. ఠాకూర్ తెలిపినట్టు కథనాలు వచ్చాయి. అయితే తిరుపతిలోని రూయా హాస్పిటల్‌లో ఐదుగురు వైద్యుల బృందం పోస్ట్ మార్టమ్‌ నిర్వహించి, అతి సమీపంలో వారిని కాల్చినట్టు' నివేదిక ఇచ్చింది. దీంతో 2015 ఏప్రిల్‌ 10న హైదరాబాద్‌ హైకోర్టు అనుమానిత ఎర్రచందనం స్మగర్ల హత్యలపై 302 కింద కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. ఆ సంఘటన ఆధారంగానే దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియసామి ఈ సినిమా తెరకెక్కుస్తున్నాడని తమిళ నాట వార్తలు వస్తున్నాయి. మరి ఇందులోని నిజానిజాలను మేకర్స్ ఎప్పుడు తెలియచేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి

Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..

బాత్రూమ్‌లో జారి ప‌డి.. పైకి లేవ లేని స్థితిలో ఒంట‌రిగా షావుకారు జానకి కుమార్తె!

Updated Date - Oct 27 , 2026 | 02:24 PM

బాత్రూమ్‌లో జారి ప‌డి.. పైకి లేవ లేని స్థితిలో ఒంట‌రిగా షావుకారు జానకి కుమార్తె!

హీరో అజిత్‌కు గుడి.. విగ్రహానికి క్షీరాభిషేకం

ధనుష్ కానుకలపై బీజేపీ గుర్తు.. రంజుగా త‌మిళ రాజకీయం

పవన్ భార్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్.. రేణుకి జరిగిందే జరిగిందా

Kommuri: 'తెలుగు సినిమా' సంపాదకుని శతజయంతి!