ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కన్నుమూత
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:17 AM
ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఆర్. చెళియన్ (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తరమణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఆర్. చెళియన్ (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తరమణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. శివగంగై జిల్లాకు చెందిన చెళియన్ (R. Chezhiyan).. చిన్న వయసులోనే ఫొటోగ్రఫీపై ఆసక్తితో చెన్నై వచ్చి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రముఖ కెమెరామ్యాన్‌గా స్థిరపడ్డారు. లెజండరీ కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్ దగ్గర సహాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2007లో విడుదలైన ‘కల్లూరి’ మూవీతో కెమెరామ్యాన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రెట్టైచుళి’, ‘మగిళ్చి’, ‘తెన్‌మేర్కు పరువకాట్రు’, ‘పరదేశి’, ‘జోకర్’ వంటి అనేక చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేశారు. పలు లఘు చిత్రాలతో పాటు డాక్యుమెంటరీలకు కూడా పనిచేశారు.
2017లో ఆయన ‘టూలెట్’ అనే మూవీకి కెమెరామ్యాన్‌గా పనిచేయడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ చిత్ర విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆయనకు భార్య ప్రేమ, అదిత అనే కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం ఆయన కుమారుడు అరుదైన వ్యాధితో మృతి చెందారు. కుమారుడి మృతి తర్వాత చెళియన్ తీవ్రంగా కుంగిపోయారు. ‘ది ఫిల్మ్ స్కూల్’ ద్వారా యువ దర్శకులకు మార్గదర్శకత్వం వహించడానికి తన చివరి రోజులను ఆయన అంకితం చేశారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషి రాబోయే తరాల కళాకారులకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెబుతూ.. చెళియన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్
మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!
Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్