సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిర్మాతలు మొండి చెయ్యి.. అజిత్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jun 25 , 2026 | 08:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆయన పేరు బాగా వైరల్ అవుతోంది.

AK64 Movie Latest Update

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతలు క్యూ కడుతుంటారు, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సరైన ప్రొడ్యూసర్ దొరక్కపోవడంతో.. అజిత్ స్వయంగా రంగంలోకి దిగారు. తన సొంత ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి, అందులోనే తన 64వ ప్రాజెక్ట్ (#AK64)ను స్వయంగా నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది.


ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) వంటి సినిమాను తెరకెక్కించిన లక్కీ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ (Aadhik Ravichandran) దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఆధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకుని, షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తరహాలో కాకుండా, ఈ కొత్త సినిమా ఒక పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.


ఇక ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్ విషయానికొస్తే.. కేవలం 80 నుంచి 100 రోజుల లోపే మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ పక్కా షెడ్యూల్స్ వేసుకున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ‘సమ్మర్ 2027’ కానుకగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రస్తుతం ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ దొరక్క సొంత ప్రొడక్షన్‌తోనే అజిత్ కుమార్ అడుగులు వేస్తుండటంతో, తన సొంత బ్యానర్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సో.. చూద్దాం మరి, ఈ సినిమా అజిత్‌కు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో..

ఇవి కూడా చదవండి:

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Updated Date - Jun 25 , 2026 | 08:46 PM