అనుపమ - ధ్రువ్ కాంట్రవర్సీపై శంకర్ కుమార్తె షాకింగ్ కామెంట్స్!
ABN, Publish Date - Aug 20 , 2026 | 07:17 PM
స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె అనుపమ కాంట్రవర్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్ (Aditi Shankar).. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరో కార్తి సరసన ‘విరుమన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘మావీరన్, ‘నేసియప్పా’ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా అర్జున్ దాస్ సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా ‘వన్స్‌మోర్’ ఈ నెల 27న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్, ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) - ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కాంట్రవర్సీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదంపై అదితి శంకర్ పూర్తిస్థాయిలో అనుపమకు మద్దతుగా నిలిచారు. ‘‘అనుపమ చూపించిన ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని, బాధను మనసులోనే దాచుకుని కుమిలిపోతారు. కానీ అనుపమ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటకు మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాలపై కొందరిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఆమె మాటల్లో నాకు పూర్తి నిజాయితీ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి మానసిక క్షోభను అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఓపెన్‌గా మాట్లాడి అందరికీ అవగాహన కల్పించింది. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల చాలామందికి ఒక స్పష్టత వచ్చిందని నమ్ముతున్నాను’’ అని అదితి పేర్కొన్నారు.
అలాగే చిత్రసీమలో తన కెరీర్ ప్రయాణంపై వస్తున్న కామెంట్లపై కూడా ఆమె స్పందించారు. చిత్రపరిశ్రమలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఎందుకు చేశారని చాలామంది అడుగుతున్నారని చెబుతూ.. సంఖ్య కంటే కంటెంట్ ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మనం ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎలాంటి పాత్రలు చేశాం, ప్రేక్షకుల హృదయాల్లో ఎంతకాలం నిలిచిపోయాం అన్నదే ప్రాధాన్యం. అందుకే నా మనసుకు నచ్చిన, గుర్తుండిపోయే బలమైన కథలనే ఎంచుకుంటున్నాను’’ అని ఆమె వివరించారు. అనుపమ కాంట్రవర్సీపై ఆమెకు మద్దతు ఇస్తూ అదితి శంకర్ చేసిన ఈ బోల్డ్ అండ్ ఓపెన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
వరుస బ్లాక్‌బస్టర్స్ మిస్సయిన చైతూ.. ఇప్పటికైనా ఆ దర్శకుడికి ఓకే చెబుతాడా
రజనీకాంత్ మూవీలో రామ్ పోతినేని.. ఇది ఎవరూ ఊహించలేదు కదా
సొంతూరులో కూరగాయలు అమ్మిన హీరో.. ఏఐ ఫొటోలు కాదండోయ్!