సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హిట్ కోసం తపిస్తున్న భామలు.. హీరోయిన్లకు ఇప్పుడు అసలైన పరీక్ష!

ABN, Publish Date - Nov 06 , 2026 | 07:02 AM

సాయిపల్లవి, నయనతార, నజ్రియా.. కోలీవుడ్‌లో ఈ ముగ్గురు హీరోయిన్లు తమ సినిమాల విజయంపై ఆశలు పెట్టుకున్నారు.

Sai Pallavi, Nayanthara, Nazriya

కోలీవుడ్‌లో (Kollywood) ముగ్గురు హీరోయిన్లు విజయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో సాయిపల్లవి (Sai Pallavi), నయనతార (Nayanthara), నజ్రియా (Nazriya Nazim) ఉన్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన రామాయణం (Ramayana) చిత్రంలో సాయిపల్లవి సీత‌గా నటించగా, పాన్ ఇండియా మూవీగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 5న విడుదలైంది. ఈ చిత్రంపై సాయి పల్లవి గంపెడాశలు పెట్టుకున్నారు.

కాగా ప్రఖ్యాత హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రధాన పాత్ర పోషించిన 'మూక్కుత్తి అమ్మన్-2' (Mookuthi Amman 2)శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలి కాలంలో తెలుగులో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మిన‌హా నయనతార నటించిన త‌మిళ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో 'మూక్కుత్తి అమ్మన్-2' విజయంపై ఆమె ఆశలు పెట్టుకున్నారు.

ఈ చిత్రాన్ని రూ.120 కోట్ల బడ్జెట్తో నిర్మించగా, నయనతార కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే, ఇదే చిత్రంలో ప్రతినాయకురాలిగా నటించిన రెజీనా కెసాండ్రా (Regena Cassandrra) కూడా సినిమా విజయంపై ఆశలు పెట్టుకున్నారు. చివరగా సూర్య హీరోగా రూపొందిన సీన్ (Scene) చిత్రంలో నటించిన నజ్రియా రాజా రాణి సినిమా అనంత‌రం 12 యేళ్ళ తర్వాత తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం విశేషం.. ఆమె తన రీఎంట్రీ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 07:31 AM