అజిత్‌ బాట‌లో.. మ‌రో త‌మిళ స్టార్‌ హీరో

ABN , Publish Date - Sep 29 , 2026 | 08:30 AM

సీనియర్ నటుడు కార్తిక్ తనయుడు, హీరో గౌతమ్ రామ్ కార్తీక్ మ‌రో స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ మార్గంలో ప్రయాణించనున్నారు.

Gautham Ram Karthik

సీనియర్ త‌మిళ నటుడు కార్తిక్ (Karthik) తనయుడు, హీరో గౌతమ్ రామ్ కార్తీక్ (Gautham Ram Karthik) మ‌రో స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ (Ajith) మార్గంలో ప్రయాణించనున్నారు. అజిత్ కార్ రేసింగ్‌లో రాణిస్తుంటే, గౌతమ్ కార్తీక్ మాత్రం బైక్ రేసింగ్‌పై అమితాసక్తి చూపిస్తూ శిక్షణ కూడా పొందుతున్నారు.

ఈ బైక్ రేసింగ్ (bike race) ను ఆయన హాబీగా చూడటం లేదు. రేసింగ్‌లో ఉండే మెళకువలను తెలుసుకుంటూ మోటార్ స్పోర్ట్స్ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం మోటార్ రేస్‌ల‌ను క్రమం తప్పకుండా వీక్షిస్తూ బైక్ రేసింగ్‌లో కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు.

అంతేకాకుండా, గౌతమ్ రామ్ కార్తీక్, అతని స్నేహితులు కలిసి బైక్ ట్రిప్, దానికోసం చేసిన సన్నాహాలు, శిక్షణ వంటి వివిధ ఘట్టాలపై ఒక లఘు చిత్రాన్ని కూడా రూపొందించారు. బైక్ రేసింగ్‌పై ఉన్న తన ఆసక్తిని అభిరుచిగానే కాకుండా, అందులో సరిగ్గా శిక్షణ పొంది తదుపరి స్థాయికి వెళ్ళాలనే పట్టుదలతో ఈ యువ హీరో ఉన్నారు. ప్రస్తుతం 'బ్లడీ పాలిటిక్స్', 'రూట్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 10:20 AM