సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు

ABN, Publish Date - Nov 12 , 2026 | 07:55 AM

హీరో సూర్య నటించిన ‘సీన్‌’ (Scene) చిత్రం ఘన విజయం సాధించడంపై చిత్ర నిర్మాతలు జ్యోతిక, సూర్య అభిమానులకు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు 

హీరో సూర్య నటించిన ‘సీన్‌’ (Scene) చిత్రం ఘన విజయం సాధించడంపై చిత్ర నిర్మాతలు జ్యోతిక, సూర్య అభిమానులకు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలుపుతూ, మీ ప్రేమ అమూల్యమైనదంటూ కామెంట్స్‌ చేశారు. ఈ విషయంపై వారిద్దరూ సంయుక్తంగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ‘మా హృదయాలు కృతజ్ఞతతో పొంగిపొర్లుతున్నాయి. భాష, సరిహద్దులకు అతీతంగా ‘సీన్‌’ సినిమాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం మా బృందానికి చాలా విలువైనది. ఈ చిత్రంపై ఎంతో నమ్మకంతో థియేటర్లకు వచ్చినందుకు ధన్యవాదాలు.

మీ ప్రేమ మా పరిధిని మరింతగా విస్తరించుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. మీకు ఎప్పటికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా, జితు మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సీన్‌’ చిత్రాన్ని జ్యోతిక, సూర్య దంపతులు 2డీ ఎంటర్‌టైన్మెంట్‌, ళకారం స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కింది. దీపావళి సందర్భంగా ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం... మొదటి వారంలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. పైగా హీరో సూర్యకు ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విజయాల తర్వాత హ్యాట్రిక్‌ మూవీగా నిలిచింది. 

ALSO READ:
పెళ్లితో ఒక్కటైన అనిరుధ్ - కావ్య మారన్.. ఫోటోస్ వైరల్

వాళ్లను కలుసుకోవాలని ఉబలాటపడుతోన్న కాజల్

ఆ సినిమాలతో పోటీ పడనున్న 'భోగి'..




Updated Date - Nov 12 , 2026 | 08:14 AM