పెళ్లితో ఒక్కటైన అనిరుధ్ - కావ్య మారన్.. ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:09 PM

పాన్-ఇండియా రాక్‌స్టార్, తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. గ్రీస్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kavyan Maran) మెడలో అనిరుధ్ మూడు ముళ్లు వేశాడు.

Anirudh Ravichander

పాన్-ఇండియా రాక్‌స్టార్, తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. గ్రీస్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kavyan Maran) మెడలో అనిరుధ్ మూడు ముళ్లు వేశాడు. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో నెటిజన్లు, అభిమానుల కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీకాంత్, ఎం.కె. స్టాలిన్ వంటి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ పెళ్ళికి హాజరై నూతన జంటను దీవించారు.


గ్రీస్‌లో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నో ఫోన్ పాలసీ తో ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించిన విషయం తెల్సిందే. నిన్నటి నుంచి నెట్టింట వైరల్ అవుతున్న ప్రపోజల్ వీడియోలు, కొన్ని పిక్స్ ఏఐ టెక్నాలజీతో జనరేట్ చేసి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయుతే తాజాగా అనిరుధ్ అధికారికంగా తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. పూల వర్షం మధ్యలో ఈ జంట నవ్వుతూ నడుస్తున్న ఫోటో ఎంతో అద్బుతంగా ఉంది. పెళ్లి బట్టల్లో నూతన జంట చాలా అందంగా కనిపిస్తున్నారు. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లలో ఇద్దరూ మెరిసిపోతున్నారు. ముఖ్యంగా కావ్య పాప.. డైమండ్ నెక్లెస్, దానికన్నా ఖరీదైన చిరునవ్వుతో అందరి మనసులను దోచేస్తుంది.


ఇక తన పెళ్లి ఫోటో షేర్ చేస్తూ.. నా జీవితకాలంలో ఒకే ఒక్కసారి జరిగే అద్భుతం..11.11 అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక నుంచి అనిరుధ్ సింగిల్ కాదు. కావ్య పాప భర్త అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. అనిరుధ్- కావ్య మారన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బయటకి చెప్పకుండా వారు రెండు కుటుంబాలను ఒప్పించి గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట ఇండియా రాగానే చెన్నైలో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు ఇండస్ట్రీ మొత్తం తరలిరానుంది.

Updated Date - Nov 11 , 2026 | 08:22 PM