భాను ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం
ABN, Publish Date - Mar 23 , 2026 | 05:19 PM
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అలనాటి హీరోయిన్లు భానుప్రియ (Bhanupriya), శాంతిప్రియ (Shanthipriya) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మీ (M. Lakshmi) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయస్సు 83 సంవత్సరాలు. తమ తల్లి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు భానుప్రియ, శాంతిప్రియతో పాటు కుమారుడు గోపీకృష్ణ ఉన్నారు. భానుప్రియ, శాంతి ప్రియకు తల్లి లక్ష్మి తొలి నుంచి బ్యాక్ బోన్‌గా నిలుస్తూ వచ్చారు. లక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. భానుప్రియ ఇంట జరిగిన ఈ విషాదం నుండి కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్టు సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. భానుప్రియ మాతృమూర్తిని అంతిమ దర్శనం చేసుకుని, నివాళులు అర్పించారు. ఇదిలాఉంటే భానుప్రియ రెండేళ్ళ క్రితం శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అయలాన్ సినిమాలో తల్లి పాత్రలో నటించారు.