సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Arjun: ‘సనాతనం’ మతం కాదు.. జీవన విధానం

ABN, Publish Date - May 30 , 2026 | 09:40 AM

సనాతన ధర్మం అనేది మతం కాదని అది ఒక జీవన విధానం అని సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ అభిప్రాయపడ్డారు.


సనాతన ధర్మం (Sanathana dharmam) అనేది మతం కాదని అది ఒక జీవన విధానం అని సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Arjun) అభిప్రాయపడ్డారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సుభాష్‌ కె.రాజ్‌ (Subhas K raj) దర్శకత్వంలో అర్జున్‌, అభిరామి, ప్రీతి ముకుందన్‌ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘బ్లాస్ట్‌’. గురువారం తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘సనాతన ధర్మం అనేది మతం కాదు. అది ఒక జీవన విధానం. జీవితంలో ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతుంది. దొంగతనం చేయవద్దు. ఇతరుల సొమ్ముకు ఆశపడొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి అనేక  విషయాలను సనాతన ధర్మం చెబుతుంది. ఒకవేళ సనాతన ధర్మం ఉండకూడదంటే మనం మన తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు గెంటెయ్యాలి. అది సాధ్యమా? నేను సనాతన ధర్మాన్ని ఆ విధంగానే అర్థం చేసుకున్నాను. అందరూ దీనిని అర్థం చేసుకుంటే బాగుంటుంది’ అని అర్జున్‌ వ్యాఖ్యానించారు. 

తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో అర్జున్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, సినీ హీరో, రాష్ట్ర విపక్ష నేత ఉదయనిధి సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే అర్జున్‌ పై విధంగా వ్యాఖ్యానించారనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఇదిలావుంటే, మూడే దశాబ్దాలకుపైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న అర్జున్‌ తాజాగా డెబ్యూ డైరెక్టర్‌ సుభాష్‌ దర్శకత్వంలో ‘బ్లాస్ట్‌’ మూవీలో నటించారు. తండ్రీ కూతుళ్ళ ప్రేమానుబంధాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని నిర్మించారు. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్‌’ ఫేం రవి బస్రూర్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. 

ALSO READ: అటు ‘స్పిరిట్’.. ఇటు ‘రోమాంచకం’.. సందీప్ వంగా ప్లానింగ్ అదుర్స్!


Updated Date - May 30 , 2026 | 09:49 AM