Pradeep Ranganathan: చప్పుడు లేకుండా.. కానిచ్చేస్తున్నాడుగా
ABN , Publish Date - May 29 , 2026 | 11:30 AM
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్.
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep ranganathan) తన కెరీర్‌లో మరో కీలకమైన అడుగు వేశారు. సరికొత్త కాన్సెప్ట్‌లతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ స్టార్, ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. నటనతో పాటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతూ.. ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. ఇందుకోసం సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, చాలా సైలెంట్‌గా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రదీప్ సర్వం సిద్ధం చేశారు. ఈ వార్త ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రదీప్ రంగనాథన్ సొంత బ్యానర్‌లో నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో క్రేజీ బ్యూటీ మమితా బైజు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కలయికలో అంతకుముందు డ్యూడ్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెలోని అద్భుతమైన నటనను ప్రదీప్ గుర్తించారు. ఆ పరిచయంతోనే, తన మొదటి నిర్మాణంలో ఆమెకు లీడ్ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి కంటెంట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాలను అందించాలనే ఉద్దేశంతో ప్రదీప్ ఈ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్తున్నారు. నిజానికి ప్రదీప్ రంగనాథన్ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. రవి మోహన్ హీరోగా వచ్చిన కోమాలి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్, మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తనే స్వయంగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన లవ్ టుడే చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
లవ్ టుడే సంచలనం తర్వాత ప్రదీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. డ్రాగన్, డ్యూడ్, ఎల్‌ఐకే వంటి వరుస క్రేజీ చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకు పోతున్నారు. ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ఒక భారీ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఓవైపు హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే, మరోవైపు నిర్మాతగా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ప్రదీప్ మల్టీ-టాలెంట్‌కు నిదర్శనం. ఈ యంగ్ స్టార్ తీసుకున్న నిర్ణయంతో అటు అభిమానులు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ నిర్మించబోయే ఈ మొదటి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!