KB 96: గురువును స్మరించుకున్న సినీ ప్రముఖులు.. ఘనంగా ‘కేబీ 96’ వేడుక!

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:07 AM

దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్‌ 96వ జయంతి వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి.

దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్‌ (K balachandar) 96వ జయంతి వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. టి.నగర్‌లోని భారత్‌ కల్చరల్‌ వైజీపీ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలను కె.బాలచందర్‌ అభిమానుల సంఘం నిర్వహించింది. ఈ సందర్భంగా కేబీ దర్శకత్వం వహించిన చిత్రాల్లోని పాటలతో ‘కేబీ 96’ పేరుతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, నటులు వైజీ మహేంద్రన్‌, చిన్నిజయంత్‌, రాంజీ జయంత్‌, నటీమణులు సచ్చు, అంబిక, సుహాసిని, శ్రీలోక, శైలజ సెల్లూరు, పీకే వినోదం, బాలసుబ్రమణియన్‌, దర్శకుడు కారైకుడి నారాయణన్‌, నిర్మాత ఏఎల్‌ఎస్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నటి సుహాసినితో పాటు పలువురు నటీనటులకు కవితాలయ వి.బాబు ఙ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శక శిఖరం కె.బాలచందర్‌ అభిమాన సంగం అధ్యక్షుడు నాగ, ప్రధాన కార్యదర్శి కవితాలయ వి.బాబు, కోశాధికారి మహమ్మద్‌ ఇలియాస్‌, కె.బాలచందర్‌ కుమార్తె పుష్ప, అల్లుడు కందస్వామి, ఉపాధ్యక్షుడు స్టిల్స్‌ రవి, నటుడు పూవిలంగు మోహన్‌, సంయుక్త కార్యదర్శులు సురేశ్‌, రాఘవేంద్ర, మాజీ కార్యదర్శులు సురేష్‌, రాజివేంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ:
IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!

DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

Updated Date - Oct 31 , 2026 | 11:49 AM