సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సైలెంట్ క్రికెటర్.. ఇంటెన్స్ విలన్

ABN, Publish Date - Jul 06 , 2026 | 07:14 PM

డాక్టర్లు యాక్టర్లు అవడం చూశాం. బిజినెస్ మేగ్నెట్లు బిగ్ స్క్రీన్ పై మెరవడం చూశాం. కానీ క్రికెటర్లు ఇండస్ట్రీలోకి రావడం చాలా రేర్. ఇప్పుడు మరోమారు మురళీ విజయ్ నటించబోతున్నారు.

Murali Vijay

క్రికెట్ పిచ్‌పై సిక్సర్లతో అలరించిన మాజీ భారత ఓపెనర్ మురళీ విజయ్... ఇప్పుడు వెండితెరపై వైల్డ్ అవతారం ఎత్తబోతున్నారు. క్రికెట్ మైదానంలో తన క్లాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ తమిళనాడు క్రికెటర్ ఇప్పుడు వెండితెరపై ప్రతినాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదీ కూడా ఎవరూ ఊహించని ఒక సాలిడ్ వైల్డ్ రోల్‌తో ఎంట్రీ ఇవ్వనున్నడం కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హీరోగా నటిస్తున్న తమిళ థ్రిల్లర్ అన్‌కిల్ 123లో మురళీ విజయ్ మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా వివరాలను నిర్మాత ఇషారి కె. గణేశ్ (Ishari Ganesh) రివీల్ చేశారు. ఒక ఈవెంట్‌లో మురళీ విజయ్‌ని చూసిన దర్శకుడు సామ్ ఆంటోన్, నిర్మాత గణేశ్ ఆయన లుక్స్‌కి ఫిదా అయ్యారు. తాము అనుకుంటున్న పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌కి మురళీ విజయ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని భావించి వెంటనే అప్రోచ్ అయ్యారు. మొదట్లో ఆలోచించిన మురళీ విజయ్ కథలోని ఇంటెన్సిటీ తన పాత్రకున్న ఇంపార్టెన్స్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

మురళీ విజయ్ అనగానే క్రికెట్ అభిమానులకు గ్రౌండ్‌లో ప్రశాంతంగా, క్లాస్‌గా కనిపించే ఓపెనర్ గుర్తుకొస్తారు. కానీ ఈ సినిమాలో ఆయన టోటల్ రగ్గడ్ అండ్ వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నారట. విలనిజంలో ఒక కొత్త యాంగిల్‌ని ఆయన ప్రెసెంట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పిచ్‌పై ఓపెనర్‌గా బరిలోకి దిగి ఎన్నో సెంచరీలు బాదిన మురళీ విజయ్... ఇప్పుడు వెండితెరపై విలన్‌గా ఎలాంటి 'సిక్సర్లు' కొడతారో చూడాలి. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

Updated Date - Jul 06 , 2026 | 07:18 PM