సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dulquer Salmaan: రచ్చ గెలిచాడు కానీ, ఇంట గెలవలేకపోతున్నాడే

ABN, Publish Date - Nov 22 , 2026 | 05:19 PM

ఇంట గెలిచి రచ్చ గెలవడం అనేది పెద్దలు చెప్పిన ఒక సామెత. అంటే ఏదైనా విషయాన్ని అందరిచేత ఒప్పించాలంటే.. మొదట వారి ఇంటివారిని ఒప్పించాలి అని అర్ధం. ఇదే సామెతని ఇండస్ట్రీకి అనువాదించాలంటే.. ఒక హీరో మొదట తన సొంత భాషలో సక్సెస్ అయ్యి.. ఆ తరువాత వేరే భాషల్లో సక్సెస్ అవ్వాలి..

Dulquer Salmaan

ఇంట గెలిచి రచ్చ గెలవడం అనేది పెద్దలు చెప్పిన ఒక సామెత. అంటే ఏదైనా విషయాన్ని అందరిచేత ఒప్పించాలంటే.. మొదట వారి ఇంటివారిని ఒప్పించాలి అని అర్ధం. ఇదే సామెతని ఇండస్ట్రీకి అనువాదించాలంటే.. ఒక హీరో మొదట తన సొంత భాషలో సక్సెస్ అయ్యి.. ఆ తరువాత వేరే భాషల్లో సక్సెస్ అవ్వాలి. కానీ, ఈ సామెతకు రివర్స్ లో ఉంది మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) కెరీర్. ఆయన రచ్చ గెలిచి ఇంట మాత్రం గెలవలేకపోతున్నాడు. లెజెండరీ నటుడు మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, ఏ విషయంలోనూ తండ్రి నీడలో బతకకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఉస్తాద్ హోటల్, బెంగళూరు డేస్, చార్లి లాంటి సినిమాలతో మలయాళంలో త్వరగానే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్.


అయితే ఇతర భాషల్లో సినిమాలు చేయడం మొదలుపెట్టి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాక, సొంత భాషలో మాత్రం అతడికి సరైన సినిమాలే పడటం లేదు. కొన్నేళ్ల క్రితం భారీ అంచనాలతో వచ్చిన కింగ్ ఆఫ్ కోతా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన ఐమ్ గేమ్ కూడా ప్రేక్షకులను మెప్పించలేక నిరాశపరిచింది. కానీ, తెలుగులో మాత్రం దుల్కర్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహానటి నుంచి ఇప్పుడు వచ్చిన ఆకాశంలో ఒక తార వరకు ప్రతి సినిమా దుల్కర్ ని తెలుగులో హీరోగా నిలబెట్టింది. ఇవన్నీ కంటెంట్ ఉన్న సినిమాలే.


బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలను పక్కన పెడితే, కేవలం కంటెంట్ పరంగా దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ బడ్జెట్‌లోనే కొత్త తరహా కథలను, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంలో మలయాళ దర్శకుల స్టైలే వేరు. ఓటీటీలలో ఆ సినిమాలు చూసినప్పుడల్లా ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు మన దగ్గర ఎందుకు తీయడం లేదని తెలుగు ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అంత కంటెంట్ ఉన్న ఈ ఇండస్ట్రీలో దుల్కర్ ఎందుకు నిలబడలేకపోతున్నాడు అనేది మిస్టరీగా మారింది. మమ్ముట్టి వారసుడిగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడెందుకు తన సొంత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎడగలేకపోతున్నాడు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.మరి ముందు ముందు అయినా ఈ కుర్ర హీరో తన సొంత ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ ని అందుకుంటాడా.. లేక తెలుగు దత్తపుత్రుడుగా మారిపోతాడా అనేది చూడాలి.

Updated Date - Nov 22 , 2026 | 05:38 PM