ఆరు ఓటీటీలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:49 AM

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఖలీఫా అక్టోబర్ 9 నుంచి ఆరు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా, మనోరమా మ్యాక్స్, లయన్స్‌గేట్ ప్లే తదితరాల్లో అందుబాటులోకి రానుంది.

Khalifa Movie

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దర్శకుడు వైశాఖ్ కలిసి తొలిసారి 2010లో 'పొక్కిరి రాజా' మూవీ చేశారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఇప్పుడు 'ఖలీఫా' ప్రాజెక్ట్ చేశారు. ఈ సినిమా ఆగస్ట్ 20న మలయాళంలో విడుదలైంది. నిజానికి అదే తేదీన తెలుగులోనూ వస్తుందని ప్రకటించారు కానీ రాలేదు.


ఓనం కానుకగా మలయాళంలో విడుదలైన 'ఖలీఫా' సినిమాకు నెగెటివ్‌ రివ్యూస్ వచ్చాయి. సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. అయితే చిత్రంగా... సినిమా విడుదలైన కొద్ది రోజులకే దీనికి సీక్వెల్ తీస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అందులో మోహన్‌ లాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఈ ట్విస్ట్ నుంచి జనాలు ఇంకా కోలుకోకముందే 'ఖలీఫా' మేకర్స్ మరో ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారు.


అక్టోబర్ 9న 'ఖలీఫా' మూవీ ఏకంగా ఆరో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతోందట. ఈ క్రైమ్‌ యాక్షన్ థ్రిల్లర్ ను అమెజాన్‌ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా, మనోరమా మ్యాక్స్, లయన్స్ గేట్‌ ప్లే, స్టార్జ్‌ ప్లే (ఓవర్సీస్), సింప్లీ సౌత్‌ (ఓవర్సీస్‌)లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళంలో వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాలలో 'ఖలీఫా' కూడా ఒకటి. ఇందులో మాలవికా శర్మ, షమ్మీ తిలకన్, ఇంద్రన్స్, సురేశ్‌ ఓబెరాయ్‌, మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాతో మల్లూవుడ్‌లోకి అరంగేట్రమ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి:

‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?

నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు

డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం

Updated Date - Oct 06 , 2026 | 11:53 AM

Mahima Nambiar: ‘కామ్రేడ్ కళ్యాణ్’పై మహిమా నంబియార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ramayana: రామాయణ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..  

Jailer 2: టైగర్.. ముత్తువేల్ పాండియన్ మళ్లీ వచ్చాడు

నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు

అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?