వాయిదా పడిన 'ఐయామ్ గేమ్'
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:38 PM
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'ఐయామ్ గేమ్' విడుదల వాయిదా పడింది. ఓనమ్ కానుకగా ఆగస్ట్ 20న రావాల్సిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. దాంతో అదే రోజు వస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఏర్పడింది.
ఈ యేడాది ఓనమ్ బరి నుంచి దుల్కర్ సల్మాన్ మూవీ 'ఐయామ్ గేమ్' తప్పుకుంది. బుధవారం ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వారు చెప్పారు. దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ ఆగస్ట్ 20న విడుదల కావాల్సి ఉండగా, అదే రోజున పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా వైశాఖ్ తెరకెక్కించిన 'ఖలీఫా' కూడా రిలీజ్ కు సిద్థమైంది. ఆ మర్నాడే నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా గిరీశ్ ఎ.డి. తెరకెక్కించిన 'బెత్లహామ్ కుటుంబ యూనిట్' జనం ముందుకొస్తోంది. ఈ మూడు సినిమాలతో ఈ సారి ఓనమ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ప్రేక్షకులు ఆశపడ్డారు.
అయితే ఇప్పుడు దుల్కార్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ విడుదల వాయిదా పడటం ఇటు పృథ్వీరాజ్ సుకుమార్, నివిన్ పౌలీ సినిమాలకు కలిసి వస్తుందని మలయాళ చిత్రసీమ భావిస్తోంది. అలానే ఆగస్ట్ 21న రాబోతున్న రవితేజ 'ఇరుముడి'కీ ఇది కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే 'ఐయామ్ గేమ్' మూవీని తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ రంగం సిద్థం చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ అతనికంటూ ఓ వర్గం ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఆ రకంగా దుల్కర్ మూవీ వాయిదా పడటం 'ఇరుముడి' నిర్మాతలైన మైత్రీమూవీ మేకర్స్ కు హెల్ప్ అయ్యిందనుకోవాలి. దుల్కర్ సల్మాన్ నటించిన 40వ చిత్రం 'ఐయామ్ గేమ్'లో కాయదు లోహర్, మిస్కిన్, ఆంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఓనమ్ బరి నుంచి 'ఐయామ్ గేమ్' తప్పకున్నా... దానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అది ఎప్పుడు విడుదలైన విజయం ఖాయమని దుల్కర్ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి!
ఇవి చదవండి:
Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి
త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజయ్ సర్కారు నిఘా