'ఐ యామ్‌ గేమ్‌' కోసం పాటపాడిన దుల్కర్

ABN , Publish Date - Aug 29 , 2026 | 07:12 AM

దుల్కర్ సల్మాన్ తన తాజా చిత్రం 'ఐ యామ్ గేమ్‌' కోసం మలయాళంలో ఓ పాట పాడారు. ఈ రోజు ఆ పాటను కక్కనాడలో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 3న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

I am game movie

దుల్కర్ సల్మాన్ నటించి, నిర్మించిన భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 3న రెండు తెలుగు రాష్ట్రాలలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పంపిణీ చేస్తోంది. తాజాగా ఈ సినిమాను నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు. ఈ పాటను మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వెర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ (తమిళ్), సనారే (తెలుగు) సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్‌ను బెన్నీ దయాల్ పాడగా, నుమాన్ ఖోకర్ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌లో సాయి మాధవ్ రెళ్ల వోకల్ అందించగా, హృదయ శివ సాహిత్యం రాశారు.


స్టైలిష్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ స్టైల్‌లో రూపొందిన ‘లూజర్’ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ‘ఐయామ్ గేమ్’లోని స్టైలిష్ మూడ్, ఎనర్జీని ఈ పాట కనిపిస్తోంది. సినిమా వైబ్రెంట్ వరల్డ్‌కు సంగీతం ద్వారా ఓ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది. ‘ఐయామ్ గేమ్’ ఆడియో లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 29న సాయంత్రం 6 గంటల నుంచి కక్కనాడలోని కిన్‌ఫ్రా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం రికార్డు స్థాయి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, తొలి గీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లతో పాన్-ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. సినీ ప్రేక్షకులు ఇంతకుముందు చూడని సరికొత్త స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్ అనుభూతిని ఈ సినిమా అందించబోతుంది. జీ మ్యూజిక్ సంస్థ మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకుంది.


దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ‘ఐయామ్ గేమ్’ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రం. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు, దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం ఇది. సూపర్‌హిట్ మూవీ 'ఆర్.డి.ఎక్స్' ఫేమ్‌ నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

నాకంటే ఎక్కువ రెమ్యూనరేషనా?.. ప్రభాస్‌ని దీపికా అవమానించిందా

‘ఇరుముడి’ ఎఫెక్ట్.. రవితేజ హారర్ చిత్రానికి నిర్మాతలు దొరికేశారోచ్!

నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్

Updated Date - Aug 29 , 2026 | 07:13 AM