సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ఖలీఫా'ను ఢీ కొట్టబోతున్న దుల్కర్ సల్మాన్!

ABN, Publish Date - Jul 21 , 2026 | 02:07 PM

ఆగస్ట్ 20న ఇద్దరు మలయాళ యంగ్ స్టార్ హీరోస్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. దుల్కర్ నటించిన 'ఐ యామ్‌ గేమ్‌', పృథ్వీరాజ్ 'ఖలీఫా' చిత్రాలు ఒకే రోజున పాన్ ఇండియా మూవీస్ గా వస్తున్నాయి.

Dulquer Vs Prithviraj

స్ట్రయిట్‌ తెలుగు సినిమాల కంటే కొన్ని సార్లు వివిధ భాషల నుంచి వస్తున్న అనువాద చిత్రాలే ఎక్కువగా విడుదల అవుతున్న సందర్భాలు ఉంటున్నాయి. గతంలో తెలుగులోకి తమిళ చిత్రాలు ఎక్కువ అనువాదమయ్యేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని మలయాళ సినిమాలు ఆక్రమించాయి. చిత్రం ఏమంటే... ఒకే వారం రెండు తమిళ అనువాద చిత్రాలు, రెండు మలయాళ అనువాద సినిమాలు కూడా ఒకదానితో ఒకటి తెలుగులో పోటీ పడుతున్న సంఘటనలు కొన్ని వున్నాయి.

ఆగస్ట్‌ మాసంలో తెలుగులో ఆసక్తికరమైన పోరు నెలకొనబోతోంది. ఆగస్ట్ 20న రెండు మలయాళ అనువాద చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి తెలుగువారికి ఇటీవల సక్సెస్ ఫుల్‌ మూవీస్ తో చేరువైన దుల్కర్ సల్మాన్ మూవీ 'ఐ యామ్ గేమ్‌' కాగా, మరొకటి 'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా'.


దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’. దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన, స్క్రీన్‌ప్లే అందించారు. దక్షిణ భారతదేశంలోని వందకు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ‘ఐ యామ్ గేమ్’, ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఇండస్ట్రీలోనే భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని అత్యంత స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా’ తర్వాత వేఫరర్ ఫిల్మ్స్ నుంచి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇదే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్‌బరివ్ రూపొందిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఆర్డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం కూడా ఇదే. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘ఐ యామ్ గేమ్’, ప్రేక్షకులకు భారీ స్థాయి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధమవుతోంది.


అలానే ఆగస్ట్ 20వ తేదీనే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఖలీఫా' విడుదల అవుతోంది. గతంలో మోహన్‌ లాల్ పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమాలో ఆయన పృథ్వీరాజ్‌ తాతయ్యగా నటించబోతున్నారు. ఇందులో పృథ్వీరాజ్ ‘ఆమిర్ అలీ’ అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను వైశాఖ్‌ తెరకెక్కిస్తున్నాడు. దీన్ని జీను వి అబ్రహం, సూరజ్ కుమార్ నిర్మిస్తున్నారు. జేక్స్ బెజాయ్‌ సంగీతం అందిస్తున్నాడు. దుల్కర్ మూవీలానే ఇది కూడా పాన్ ఇండియా సినిమానే! అయితే తెలుగులో రాబోతున్న ఈ రెండు మలయాళ అనువాద చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడటమే కాదు... ఇక్కడ 21న రవితేజ 'ఇరుముడి'తోనూ ఢీ కొట్టబోతున్నాయి. మరి వీటిల్లో ఏది విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది

రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..

Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా

Updated Date - Jul 21 , 2026 | 04:36 PM