సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దృఢం లేడీ విలన్.. యమా హాట్ గురూ..

ABN, Publish Date - Jun 13 , 2026 | 01:42 PM

ఇండస్ట్రీలో అదృష్టం.. ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో! కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా వారికి నేమ్, ఫేమ్ రాదు. మరికొంతమందికి ఆ నేమ్, ఫేమ్ మొదటి సినిమాకే దక్కుతోంది.

Saniya Fathima

ఇండస్ట్రీలో అదృష్టం.. ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా వారికి నేమ్, ఫేమ్ రాదు. మరికొంతమందికి ఆ నేమ్, ఫేమ్ మొదటి సినిమాకే దక్కుతోంది. అలా మొదటి సినిమాతోనే కుర్రకారికి క్రష్ గా మారింది సానియా ఫాతిమా. ఎవరీమె.. అంతకు ముందు ఎప్పుడు చూడలేదే అనుకుంటున్నారా.. దృఢం (Dridam) సినిమా చూసినవారికి ఈ ముద్దుగుమ్మ గురించి బాగా తెలుసు. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ నిర్మించిన చిత్రం దృఢం. మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షేన్ నిగమ్ హీరోగా నటించగా .. సానియా ఫాతిమా (Saniya Fathima) నటిగా పరిచయమైంది. విద్యా జయచంద్రన్ అనే కానిస్టేబుల్ పాత్రలో సానియా నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అమ్మడి విశ్వరూపం చూస్తే మెంటల్ వచ్చేస్తుంది.


సినిమాలో ఎస్ఐ విజయ్ ని తొలిచూపులోనే ప్రేమిస్తూ, స్టేషన్‌లో అమాయక చూపులతో ఆరాధించే కానిస్టేబుల్‌గా ఆమె నటన అద్భుతంగా ఉంది. కథ నడుస్తున్నంత సేపు ఆడియన్స్ కూడా వీరిద్దరు కలిసిపోతే బాగుంటుందని కోరుకుంటారు. కానీ, సినిమా ఆఖరి 20 నిమిషాల వైల్డ్ క్లైమాక్స్‌లో ఈమె పాత్ర ఇచ్చే షాకింగ్ ట్విస్ట్‌కి ఎస్ఐ విజయ్‌కే కాదు, చూస్తున్న ఆడియన్స్‌కి కూడా బుర్ర పాడైపోతుంది. అంతవరకు అమాయకంగా కనిపించిన ఆ అమ్మాయిలోనే ఇంత క్రూరత్వం, నమ్మకద్రోహం దాగుందా అని ప్రేక్షకులు అవాక్కవడం ఖాయం.


ఇక ఈ సినిమాతో సానియా ఫేట్ మారిపోయింది. అందాల భామ విలనిజానికి ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు. సినిమాలో అంత అమాయకంగా కానిస్టేబుల్ యూనిఫారంలో కనిపించిన సానియా, బయట మాత్రం మోడరన్ డ్రెస్సుల్లో చాలా హాట్‌గా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. దీంతో కుర్రాళ్ళు.. సానియాను నయా క్రష్ గా మార్చేశారు. ఈ సినిమా తరువాత సానియాకు వరుస అవకాశాలు క్యూ కడతాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి ఈ భామ ముందు ముందు తెలుగులో కూడా దర్శనమిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది

Lenin: మళ్ళీ అయ్యగారి సినిమా వాయిదా.. ?

షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో

Updated Date - Jun 13 , 2026 | 04:37 PM