సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:12 AM

ప్రతి డైరెక్టర్ కూడా బయట చూసిన కొన్ని సన్నివేశాలను ఇన్‌స్పైర్ అయ్యి సినిమాలు తీస్తూ ఉంటారు. వాటి గురించి కొంతమంది బయటపెడతారు. మరికొంతమంది బయటపెట్టరు.

ప్రతి డైరెక్టర్ కూడా బయట చూసిన కొన్ని సన్నివేశాలను ఇన్‌స్పైర్ అయ్యి సినిమాలు తీస్తూ ఉంటారు. వాటి గురించి కొంతమంది బయటపెడతారు. మరికొంతమంది బయటపెట్టరు. తాజాగా ఒక హిట్ సినిమాలోని ఐకానిక్ సీన్ ని ఆ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి తెరకెక్కించారట. దాదాపు 28 ఏళ్ళ తరువాత ఈ విషయం బయటపడింది. ఆ సినిమా ఏంటి.. ఆ డైరెక్టర్ ఎవరు.. ? అని అంటే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. ఆ సినిమా ఇద్దరు.


తాజాగా మణిరత్నం భార్య, నటి సుహాసిని ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇద్దరు. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా కనిపిస్తారు. ఒక సినిమా హిట్ అయ్యాకా.. మోహన్ లాల్.. ప్రకాష్ రాజ్ ఇంటికి వెళతాడు. అక్కడ మోహన్ లాల్ ని చూడడానికి చాలామంది జనం వస్తారు. ప్రకాష్ రాజ్.. మోహన్ లాల్ ని టెర్రస్ పైకి తీసుకెళ్ళి ప్రజలకు అభివాదం చేయమని చెప్తాడు. ఆ సినిమాకే ఈ సీన్ హైలైట్ అని చెప్పవచ్చు. అయితే ఆ పవర్‌ఫుల్ టెర్రస్ సీన్ తీయడానికి మెగాస్టార్ చిరంజీవినే మెయిన్ ఇన్‌స్పిరేషన్ అంటూ సుహాసిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


'చిరంజీవి సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో జరిగినప్పుడు.. ఆ ఫంక్షన్‌కు నేను, మణి సార్ వెళ్ళాము. ఆ సమయంలో చిరంజీవి స్టేజ్ మీద నడిచిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్ మణిరత్నంను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఫంక్షన్‌లో చిరంజీవి రాయల్ వాకింగ్ స్టైల్‌ను చూసి మణి సార్.. చూడు, ఆయన ఎంత స్టైలిష్‌గా నడుస్తున్నారో.. ఈ వాకింగ్ స్టైల్‌ను నా సినిమాలో ఒక క్యారెక్టర్‌కు వాడతాను అని అన్నారు. అప్పుడే ఆయన ఇద్దరు సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో మోహన్ లాల్ పొలిటికల్ లీడర్‌గా ఎదిగే క్రమంలో వచ్చే టెర్రస్ సీన్‌లో చిరంజీవి వాకింగ్ స్టైల్‌ను ఇన్స్‌పైర్ అయి డిజైన్ చేశారు' అని తెలిపారు.


ఇక ఈ ఇన్సైడ్ సీక్రెట్ బయటకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. మణిరత్నం లాంటి ఒక మాస్టర్ డైరెక్టర్ కూడా మెగాస్టార్ స్టైల్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి అంతటి క్లాసిక్ సీన్ క్రియేట్ చేశారంటే చిరంజీవి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ ఈ వీడియోను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:


Lenin: మళ్ళీ అయ్యగారి సినిమా వాయిదా.. ?

Sunday Tv Movies: జూన్‌ 14, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో

Samantha: సమంత ‘లేడీ బాషా’.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?

రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు ఇది నిరాశే..

Singa Title Glimpse: బ్లాక్ పాంథర్‌లా గోపీచంద్ ఎంట్రీ.. గ్లింప్స్ అదిరింది

Updated Date - Jun 13 , 2026 | 01:03 PM