మీరా జాస్మిన్ చీర కుచ్చిళ్ళు సరిచేస్తూ.. మోహన్ లాల్ నెక్ట్స్ ట్రీట్ ఇదే
ABN, Publish Date - Jun 26 , 2026 | 07:21 PM
బ్లాక్‌బస్టర్ హిట్ ‘తుడరుమ్’ కాంబో రిపీట్ కాబోతోంది. మోహన్ లాల్ - తరుణ్ మూర్తి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘తుడరుమ్’ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘అతి మనోహరం’.
బ్లాక్‌బస్టర్ హిట్ ‘తుడరుమ్’ (Thudarum) కాంబో రిపీట్ కాబోతోంది. మోహన్ లాల్ (Mohan Lal) - తరుణ్ మూర్తి (Tharun Moorthy) కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘తుడరుమ్’ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘అతి మనోహరం’ (AthiManoharam). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ప్రకారం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ పోస్టర్‌ని గమనిస్తే.. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్‌లో మోహన్ లాల్ చాలా సాంప్రదాయబద్ధమైన లుక్‌లో, మోకాళ్లపై కూర్చుని నటి మీరా జాస్మిన్ వైపు ఎంతో ప్రేమగా చూస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఆమె చీర కుచ్చిళ్లను ఆయన సరి చేస్తుండటం ఎంతో అందంగా, ఎమోషనల్ టచ్‌ని ఇస్తోంది. ‘తుడరుమ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం, పోస్టర్ అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇందులో చాలా గ్యాప్ తర్వాత మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.
ఆశిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆశిక్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఒక విలక్షణమైన ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చిత్రబృందం ఎంతో ధీమా వ్యక్తం చేస్తోంది. సో.. మలయాళంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోహన్ లాల్ అభిమానులు ఈ ‘అతి మనోహరమైన’ విజువల్ ట్రీట్ కోసం డిసెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు
ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!