సంక్రాంతి బరిలోకి విజయ్ సేతుపతి.. జనవరి 14న పాకెట్ నావల్!
ABN, Publish Date - Nov 24 , 2026 | 08:57 AM
విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ జంటగా త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్న పాకెట్ నావల్ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
త్యాగరాజన్ కుమారరాజా (Thiagarajan Kumararaja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పాకెట్ నావల్ (Pocket Novel Movie) చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan) , విజయ్ సేతుపతి (Vijay Sethupathi) జంటగా నటించారు. వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రలను కన్నడ నటుడు రాజ్ పి శెట్టి, కిషోర్ తదితరులు నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాలో మాళవిక మోహనన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో 'ఈ ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం, ఇతర సభ్యులను చూపించారు.