DC: కొరియన్ కనకరాజు తో లోకేష్ కనగరాజ్ ఢీ!
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:57 PM
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'డీసీ' వారం ఆలస్యంగా ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. ఇప్పుడీ సినిమా వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పోటీ పడబోతోంది.
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫిల్మ్ మేకర్‌గా లోకేష్ కనగరాజ్ స్టైలే వేరు. అతను యూనివర్స్ సినిమాలను అభిమానించి, ఆరాధించే కల్ట్ ఆడియెన్స్ పెద్ద సంఖ్యే. అతను తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా 'డీసీ'. వామికా గబ్బి ప్రధన పాత్ర పోషిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాకు అరుణ్ మాతేశ్వర్ దర్శకుడు. అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. దీనిని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో జూలై 31న విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. బహుశా ఈ నెల 23న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినిమా 'జననాయగన్' విడుదల కాబోతున్న కారణంగా కావచ్చు. ఇప్పుడీ సినిమాను ఆగస్ట్ 7కు వాయిదా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఆసియన్ సురేశ్ సంస్థ విడుదల చేయబోతోంది.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆగస్ట్ 7న విడుదల అనేసరికీ లోకేష్ కనగరాజ్... 'కొరియన్ కనకరాజు'తో పోటీ పడుతున్నట్టు అయిపోయింది. ఎందుకంటే వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన 'కొరియన్ కనకరాజు' మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాతో పాటే 'కెజెక్యూ, అనకాపల్లి' చిత్రాలు ఆగస్ట్ 7నే విడుదల కాబోతున్నాయి. మరి ఈ యూత్‌పుల్ యాక్షన్ డ్రామాలలో దేనికి ప్రేక్షకులు ఓటు వేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం
సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి
బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!