యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కొంబా’ కాన్సెప్ట్ ఇదే..

ABN , Publish Date - May 27 , 2026 | 10:52 AM

గోల్డెన్‌ ఆరో ప్రొడక్షన్‌ పతాకంపై షణ్ముగసుందరం నిర్మించిన చిత్రం ‘కొంబా’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, గేయరచనతో పాటు దర్శకత్వం కూడా వహించిన రాజభారతి హీరోగా నటించారు.

Komba Movie Update

గోల్డెన్‌ ఆరో ప్రొడక్షన్‌ పతాకంపై షణ్ముగసుందరం నిర్మించిన చిత్రం ‘కొంబా’ (Komba). ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, గేయరచనతో పాటు దర్శకత్వం కూడా వహించిన రాజభారతి (Raaja Bharathi) హీరోగా నటించారు. ‘కాంతార’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ఉక్రమ్‌ రవి ప్రతినాయకుడిగా, నిషా ఇస్మత్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సింగం పులి, పరుత్తి వీరన్‌ శరవణన్‌, చరణ్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ విశేషాలను దర్శక హీరో రాజభారతి మీడియాకు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక సెంటిమెంటల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. నేటి యువతరం డ్రగ్స్‌కు బానిసవుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతయ్యే మత్తుపదార్థాలకు అలవాటుపడిన యువత వల్ల వారి కుటుంబాలతో పాటు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ డ్రగ్‌ కల్చర్‌‌ను ఎలా నిర్మూలించాలి? అనే అంశాలపై దృష్టిసారిస్తూ రూపొందించాం. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో పాటు సమాజానికి అవసరమైన సందేశాన్ని మూవీలో చెప్పాం. సేలం, ఏర్కాడులోని అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ జరిపాం.


సినిమా చాలా బాగా వచ్చింది. అవుట్‌ఫుట్‌తో అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా హిట్ కొడుతున్నామనే నమ్మకం మాలో ఉంది. టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, ట్రైలర్‌ విడుదల చేస్తాం. ప్రమోషన్స్ చాలా కొత్తగా చేయబోతున్నాం. త్వరలోనే ఆ వివరాలు కూడా తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

Updated Date - May 27 , 2026 | 10:52 AM