సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఖలీఫా 2 – ది లెగసీ’.. మోహన్‌లాల్‌తో సీక్వెల్ రెడీ!

ABN, Publish Date - Aug 22 , 2026 | 04:16 PM

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా వైశాఖ్ (vaisakh) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa 2) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాకు మార్కెట్‌లో తగినంత బజ్ రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మలయాళ వెర్షన్‌కు భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ‘ఖలీఫా’ టీమ్ సడెన్‌గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా సక్సెస్ మీట్‌లోనే ‘ఖలీఫా 2’ను అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించింది. ‘ఖలీఫా 2 – ది లెగసీ’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్ కీలకమైన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన మంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రను పోషించనుండగా.. మొదటి భాగంలో హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమిర్ అలీగా మరోసారి కనిపించనున్నారు.

మొదటి భాగంలో కొనసాగిన కథనే సీక్వెల్‌లో ముందుకు తీసుకెళ్లనుండగా.. ఈసారి అహ్మద్ అలీ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం చూసిన వారికి మోహన్‌లాల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమిర్ అలీ తాతగా మోహన్‌లాల్ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. టోవినో థామస్ కూడా సహాయక పాత్రలో నటించారు. జిను వి. అబ్రహామ్, సూరజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఉన్న పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. మొదటి భాగం విడుదలైన వెంటనే సీక్వెల్‌ను ప్రకటించడం, అందులో మోహన్‌లాల్‌ను కీలక పాత్రలోకి తీసుకురావడం ఇప్పుడు మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

Updated Date - Aug 22 , 2026 | 04:28 PM