Kayadu Lohar: అలాంటి లెక్కలేసుకోను.. అదే కీలకం!

ABN , Publish Date - Apr 26 , 2026 | 02:35 PM

ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్రాగన్‌’తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది కయాదు లోహర్‌. అందులోని ‘పల్లవి’ పాత్రతో యువకుల హృదయాలను దోచేసిందీ బ్యూటీ. తాజాగా ఈ భామ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.

Kayadu Lohar

ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్రాగన్‌’తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది కయాదు లోహర్‌ (Kayadu Lohar). అందులోని ‘పల్లవి’ పాత్రతో యువకుల హృదయాలను దోచేసిందీ బ్యూటీ. తాజాగా మలయాళ చిత్రం ‘పళ్లిచట్టంబి’లో మెరిసిన ఈ అస్సామీ భామకు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాకు తెలియజేశారు.

‘ప్యారడైజ్‌’లో సుబ్బలక్ష్మిగా...

తెలుగులో ఉన్న ఫాలోయింగ్‌ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్నో సినిమాలు చేసినా రాని ఫాలోయింగ్‌ ఒక్కసారి వచ్చేసరికి ఆశ్చర్యపోయా. ప్రస్తుతం నానితో చేస్తున్న ‘ప్యారడైజ్‌’ (Nani Paradise)లో సుబ్బలక్ష్మిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతాననే నమ్మకం ఉంది.

సవాలు విసిరే పాత్రలు...

హీరోయిన్‌గా నన్ను నేను నిరూపించుకునేలా, సవాలు విసిరేలా ఉండే పాత్రలు చేయడమంటే ఇష్టం. నాయికగా నా కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతా. నాకు ఇష్టమైన దర్శకులు మణిరత్నం, సుకుమార్‌. వారి సినిమాల్లో నటించాలని ఉంది.


అస్సలు ఊహించలేదు...

‘పవళమల్లి’ పాట ఇంతటి సెన్షేషన్‌ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ రోజు అర్ధరాత్రి రెండు గంటలకు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ ఫోన్‌ చేసి ‘పవళమల్లి’ పాటలో నటించమన్నారు. ఈ పాట రిహార్సల్స్‌ కోసం రెండు రోజుల పాటూ నిద్రపోకుండా సాధన చేశా. సాంగ్‌ విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్‌ చూసి కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందనిపించింది.

ఆశలు పెట్టుకున్నా... కానీ...

నిర్మాణంలో బాగుందనుకున్న సినిమా పరాజయం పాలైతే బాధగా ఉంటుంది. అలా ‘ఫంకీ’ ఫలితం నిరుత్సాహపరిచింది. ఆ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నా. కానీ ఫలితం అనేది మన చేతుల్లో ఉండదుగా. రెండు రోజులు బాధపడి తర్వాతి ప్రాజెక్ట్‌ మీదకు మనసు మళ్లించా.


లెక్కలేసుకోను...

ప్రతీ సినిమా కోసం నా పాత్రకు సంబంధించి కచ్చితంగా వర్క్‌షాప్స్‌ చేస్తా. పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగాకే సెట్స్‌లోకి అడుగుపెడతా. నాకు తెలియని భాషలో సినిమా చేసేముందు మరింత జాగ్రత్తగా ఉంటా. అందులో నా పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌, యాస కోసం ఆ భాషలో ప్రత్యేకంగా కోచ్‌ను నియమించుకుంటా. నేను పోషించే క్యారెక్టర్‌కు సంబంధించిన రెఫరెన్స్‌ కోసం బుక్స్‌ చదువుతా. ఎంతో కొంత పరిశోధన చేస్తా. అలాగే ఓ ప్రాజెక్ట్‌ అంగీకరించేముందు ఆ కథలో నా పాత్ర ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుంటా. నా రోల్‌ కీలకమైతే చేసే సినిమా చిన్నదా, పెద్దదా అని లెక్కలేసుకోను.

ఫ్రెష్‌ ఫేస్‌...

నా మాతృభాష నేపాలీ. అస్సామ్‌లో పుట్టి పెరిగా. ఆ తర్వాత పూణేకు మారిపోయాం. మా కుటుంబానికి నేపాలీ మూలాలున్నాయి. ఒక పోటీలో ‘ఫ్రెష్‌ ఫేస్‌’గా ఎంపికైన తర్వాత మోడలింగ్‌ అవకాశాలు వచ్చాయి. 2021లో కన్నడ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టా. ఫిట్‌గా ఉండటం ఇష్టం. స్విమ్మింగ్‌, డాన్సింగ్‌తో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటా. తెలుగులో ‘అల్లూరి’తో పరిచయమయ్యా. ‘డ్రాగన్‌’తో ఇక్కడ కూడా గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?

బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?

లెజెండరీ మల్టీస్టారర్‌‌ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

Updated Date - Apr 26 , 2026 | 02:35 PM

Kayadu Lohar: గ్లామర్‌.. పాత్రలు కావాలి

Kayadu Lohar: టాస్మాక్ స్కామ్.. హద్దులు దాటారు

Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 ల‌క్ష‌లు... చిక్కుల్లో డ్రాగ‌న్ బ్యూటీ... లిక్క‌ర్ స్కాంలో పేరు

Kayadu Lohar: విజయ్.. నీవి స్వార్ధపూరిత రాజకీయాలు.. కయాదు ఏం చెప్పిందంటే