మరోసారి వెనక్కి వెళ్ళిన '418'
ABN , Publish Date - Sep 15 , 2026 | 03:53 PM
కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ '418' మరోసారి వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన కన్నడ సినిమా '418'. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ ట్రైలర్ తో ఈ మధ్య కాలంలో వస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీస్ లో అత్యంత భయాన్ని కలిగించే చిత్రం ఇదే అనే భావన అందరికీ కలిగింది. ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటించారు. అట్మాస్ఫెరిక్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందని మేకర్స్ చెప్పారు. నిజానికి ఈ సినిమా జూలై 31న విడుదల కావాల్సింది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌ను వాయిదా వేసి... ఈ మధ్య సెప్టెంబర్ 18న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడేమో మరోసారి మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్‌కు ఉన్న ఇమేజ్ తో ఇదేదో కాస్తంత భిన్నంగా ఉండే సినిమా అని అందరూ '418' కోసం ఎదురుచూస్తుంటే... మేకర్స్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దాంతో సినిమాకు ఉన్న కొద్దిపాటి క్రేజ్ కూడా పోయేట్టుగా ఉంది. మరింత బెటర్‌గా, మరిన్ని భాషల్లో దీనిని విడుదల చేయడం కోసం వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ చిన్న సినిమాను కూడా ఇన్ని సార్లు వాయిదా వేస్తే... నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుందని మేకర్స్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియదు!
ఇవి కూడా చదవండి!
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!