కమల్ హాసన్, శివకార్తికేయన్‌ల ‘సెయాన్’ క్రేజీ అప్డేట్!
ABN , Publish Date - May 18 , 2026 | 03:34 PM
వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. ‘సెయాన్’ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. ‘సెయాన్’ (Seyon) అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మైల్‌స్టోన్ మూవీ ‘అమరన్’ (Amaran) అఖండ విజయం తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌లో శివకార్తికేయన్ నటిస్తున్న తదుపరి చిత్రం ఇదే కావడం విశేషం. ఇటీవల శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ వదిలారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ నేడు (మే 18) అధికారికంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ ఒక ఇంటెన్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్లోజప్ పోస్టర్‌లో శివకార్తికేయన్ లుక్ రౌద్రంగా ఉంది. ఆయన ముఖంపై పడుతున్న మంటల వెలుతురు, కళ్లలో కనిపిస్తున్న కసి.. సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే ఆధ్యాత్మికతతో కూడిన పక్కా మాస్ యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా.. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునే రూటెడ్ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ, సాన్ లోకేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా ఇటీవల టీమ్ తెలిపింది. ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసింది కానీ, ఇప్పుడామె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందులో నటించే హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!
కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!