సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jananayagan: ‘జన నాయగన్‌’ లీక్‌ కేసులో  కొత్త కోణం 

ABN, Publish Date - Jun 06 , 2026 | 10:04 AM

హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వ్యవహారంలో మరో ఆరుగురిని సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వ్యవహారంలో మరో ఆరుగురిని సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 15కు చేరుకుంది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించగా, జనవరి 9వ తేదీన విడుదల కావాల్సివుండగా, సెన్సార్‌ సర్టిఫికేట్‌ వివాదం కారణంగా విడుదల కాలేదు.

అదే సమయంలో ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ‘జన నాయగన్‌’ విడుదల తేదీపై స్పష్టత లేదు. దీంతో ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్ల్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి చెల్లించాలని సీఎం విజయ్‌ నిర్మాతను ఆదేశించినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

ALSO READ: ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!


పవన్ కళ్యాణ్‌తో ‘జీసస్‌’ అనుకున్నప్పుడే ‘సింగ్ గీతం’ కథ సిద్ధమైంది: దేవిశ్రీ


Updated Date - Jun 06 , 2026 | 10:04 AM