పవన్ కళ్యాణ్‌తో ‘జీసస్‌’ అనుకున్నప్పుడే ‘సింగ్ గీతం’ కథ సిద్ధమైంది: దేవిశ్రీ

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:57 AM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘సింగ్ గీతం’. తాజాగా ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

DSP About Sing Geetham

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ గురించి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.


‘‘నేను సింగీతం సార్‌కు వీరాభిమానిని. ఆయన లెజెండ్. నాన్నను కలవడానికి వచ్చినప్పుడు, అలాగే వాళ్లు మాట్లాడుకుంటుంటే వారివైపు నేను ఆరాధనగా చూసేవాడిని. ‘సింగ్ గీతం’ విషయానికి వస్తే.. చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సార్‌తో జీసస్‌పై ఒక సినిమా అనుకున్నాం. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ సమయంలో సింగీతం సార్, మా స్టూడియోకు వచ్చి ఈ ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పారు. అది వినగానే నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. అప్పుడే, ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తే అప్పుడు చేయాలని అని అనుకున్నాను.


సింగీతం సార్ చేసిన ప్రయోగాలు నాకు తెలిసి మరెవ్వరూ చేసి ఉండరు. ‘పుష్పక విమానం, భైరవద్వీపం, ఆదిత్య 369’ వంటి చిత్రాలు నాకు చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఆయన నుంచి ఫోన్ రాగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఏడాది క్రితం నాగ్ అశ్విన్, స్వప్న, వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా రూపొందుతుండటం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు నేను వర్క్ చేస్తున్నందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. సింగీతం సార్‌కు ఒక ట్రిబ్యూట్‌లా, ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను..’’ అని దేవిశ్రీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

Updated Date - Jun 06 , 2026 | 12:57 AM