సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: హృతిక్ రోషన్ కోసం విజయ్ సేతుపతి త్యాగం.. క్రేజీ అప్డేట్

ABN, Publish Date - Jul 01 , 2026 | 06:28 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్’. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘జైలర్ 2’ పై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోన్న విషయం తెలియంది కాదు.

Jailer 2 Latest Update

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్’ (Jailer). ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘జైలర్ 2’ (Jailer 2)పై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోన్న విషయం తెలియంది కాదు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్‌కు సంబంధించిన కేమియో పోర్షన్, రజనీకాంత్‌తో ఆయన కలిసి నటించిన కాంబినేషన్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా వచ్చాయని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. నెల్సన్ అనుకున్న దానికంటే స్క్రీన్‌పై వీరిద్దరి సీన్స్ చాలా అద్భుతంగా పండటంతో, సినిమాకు ఇవి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ భావిస్తున్నారు.


వాస్తవానికి ఈ పాత్ర నిడివిని ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువే చిత్రీకరించారట. సాధారణంగా రన్‌టైమ్ ఎక్కువైతే సీన్లను ట్రిమ్ చేస్తుంటారు, కానీ రజనీకాంత్, హృతిక్ కాంబో సీన్స్ మాస్ హై ఇస్తుండటంతో, ఎడిటింగ్‌లో వాటిని అస్సలు తగ్గించకూడదని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌ను కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, ఉత్తరాది ప్రేక్షకులను కూడా భారీగా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ వంటి స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల హిందీ బెల్ట్‌లో ఈ సినిమా బిజినెస్ పొటెన్షియల్, బాక్సాఫీస్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి.


ఇదిలా ఉంటే, హృతిక్ రోషన్ సీన్ల నిడివి పెరగడం వల్ల సినిమా మొత్తం రన్‌టైమ్ భారీగా పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనితో బ్యాలెన్స్ చేయడానికి మేకర్స్ మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. సినిమా నిడివిని కంట్రోల్‌లో ఉంచేందుకు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కేమియో పోర్షన్‌ను కొంతమేర తగ్గించాలని నెల్సన్ అండ్ టీమ్ భావిస్తోందట. అంటే హృతిక్ కోసం విజయ్ సేతుపతి త్యాగం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రం రీషూట్, ప్యాచ్ వర్క్ దశలో ఉంది. అవుట్‌పుట్‌ను మరింత పెంచడానికి, కొన్ని కీలకమైన సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చడానికి మేకర్స్ కొన్ని రీషూట్‌లను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రియులలో భారీ అంచనాలున్నాయనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

‘అంబ’స్ రివెంజ్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

‘కాగితం పడవలు’ చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

Updated Date - Jul 01 , 2026 | 06:28 PM