Dhanish: 'జైలర్ 2' చూసి ధనుష్ ఏమన్నాడో తెలుసా

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:40 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ (Jailer 2)ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ (Jailer 2)ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, ఎస్‌.జె. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలతో చెన్నైలోని థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. మరోవైపు, ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్‌ అభిమానులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తలైవర్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌!

చెన్నైలోని రోహిణి థియేటర్‌లో రజనీకాంత్‌ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్‌ కలిసి ‘జైలర్‌ 2’ చూశారు. దీనికి సంబంధించిన  వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సినిమా చూసిన ధనుష్ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘జైలర్‌ 2’ తప్పకుండా చూడాల్సిన సినిమా. బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది. తలైవర్‌  ఫాన్స్ కి  ఈ సినిమా  గొప్ప విందులా ఉందని ప్రశంసించారు. దీంతో రజనీకాంత్‌ అభిమానుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది. లోకేష్ కనకరాజు, కార్తీక్ సుబ్బరాజు, ఐశ్వర్య రజినీకాంత్ తదితరులు సినిమా చూసి తలైవాకి పెద్ద హిట్ అని సోషల్  మీడియా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 


ALSO READ:

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు పోలీసుల నోటీసులు.. అక్టోబర్‌ 28 డెడ్‌లైన్‌!


‘జైలర్ 2’ ప్రీ-సేల్స్ విధ్వంసం: టాప్ 10 ఆల్‌టైమ్ లిస్ట్‌లో రజనీ రికార్డ్


జైలర్‌ 2 రివ్యూ.. సీక్వెల్‌ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్‌!



Updated Date - Oct 15 , 2026 | 02:33 PM

Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం 

Jailer 2: గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే.. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిపడేశాడు

Dhanush 50: ధనుష్ 50వ చిత్రం ప్రత్యేకత ఏంటో తెలుసా?  

RajiniKanth: విజయవాడకు రజినీకాంత్‌!