సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇళయరాజా.. ఆస్తులను జప్తు చేయాలి

ABN, Publish Date - Sep 11 , 2026 | 07:01 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఆడియో కంపెనీ ‘సరిగమ’ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది.

Ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) పై ఆడియో కంపెనీ ‘సరిగమ’ (Saregama) ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) లో పరువు నష్టం దావా వేసింది. కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వులను అతిక్రమించి, తమ కంపెనీకి సొంతమైన పాటలను ఇళయరాజా ఉపయోగిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇళయరాజాను సివిల్‌ జైలులో ఉంచాలని, ఆయన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుని, ఆ ఆస్తులను విక్రయించి తద్వారా వచ్చే మొత్తాన్ని సరిగమకు అప్పగించేలా ఒక మధ్యవర్తిని నియమించాలని కోరింది.

ఇళయరాజా సంగీతం సమకూర్చిన 134 చిత్రాలకు సంబంధించిన పాటలకు రైట్స్‌ కోరడమో లేదా ఉపయోగించడమో చేయరాదని గత జూలై ఒకటో తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయగా, వీటిని ఇళయరాజా ఉల్లంఘించి ఆయా చిత్రాల పాటలను ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగమ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఇళయరాజాకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Sep 11 , 2026 | 07:01 AM