సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jana Nayagan: సీఎం విజ‌య్.. బెల్టు ఖ‌రీదెంతో తెలుసా!

ABN, Publish Date - Jul 23 , 2026 | 04:22 PM

తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఇటీవల తనిఖీల సందర్భంగా ధరించిన లూయిస్ విట్టన్ బెల్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

cm vijay

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathy Vijay) ఇటీవ‌ల చెన్నై నగరంలో తనిఖీకి వెళ్లినప్పుడు, ఆయన ధరించిన బెల్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ధర కూడా చర్చాంశనీ యంగా మారింది. తమిళ రాజకీయ నాయకులు సాధారణంగా తెల్ల ధోవతి, చొక్కా ధరి స్తుంటారు. దివంగత ముఖ్యమంత్రులు అన్నాదురై, కామరాజర్, కరుణానిధి, ఎంజీఆర్, ప్రిసీడియంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఓమందూర్ రామస్వామిరెడ్డి, మాజీ ము ఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఎంకే స్టాలిన్లకు తెల్ల ధోవతి, షర్టులే మంచి గుర్తింపు.

అయితే 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ గత ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నటించిన సినిమాల్లో లాగే రోజుకో రకహైణ‌ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. శుక్రవారాల్లో పట్టు ధోవతితో, మిగతా రోజుల్లో ఫుల్ సూట్తో విధుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు కారణం ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చినందు వల్లేనని ఆయన అభిమానులు, నెటిజన్లు విశ్లే పిస్తున్నారు.

ఇటీవల సీఎం విజయ్ స్థానిక సైదాపేటలోని ప్రభుత్వ ఎంసీ రాజా హాస్ట‌ల్‌లో, చెట్పేట్‌లోని వ్యర్ధాల నిర్వాహణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెట్పేట్‌లో క్షేత్ర పరిశోధన కోసం వెళ్లిన సీఎం, ధరించిన దుస్తులతో పోలిస్తే ఆయన ధరించిన ఎక్స్ ఆకారపు బెల్ట్ ప్రత్యేకంగా కనిపించింది. అందరి దృష్టిని ఆకర్షించిన ఆ బెల్ట్ ప్రముఖ లూయిస్ విక్లైన్ కంపెనీ తయారు చేసింది. కాగా, దాని ధర ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.66 వేలు ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇందుకు సంబ‌ధించిన న్యూస్ సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుండగా ఆ బెల్టుతో ఉన్న విజ‌య్ ఫొటోలు సైతం వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Jul 23 , 2026 | 04:52 PM