ధనుష్ 56 షూటింగ్ మొదలు.. ఆలయంలో చిత్రీకరణపై చిన్న వివాదం!
ABN, Publish Date - Sep 26 , 2026 | 11:15 AM
నిర్మాత, నటుడు, దర్శకుడు ధనుష్ (Dhanush 56) నటించే 56వ చిత్రం శివగంగై జిల్లాలోని మరనాడు కరుప్పుణస్వామి ఆలయంలో శుక్రవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.
నిర్మాత, నటుడు, దర్శకుడు ధనుష్ (Dhanush 56) నటించే 56వ చిత్రం శివగంగై జిల్లాలోని మరనాడు కరుప్పుణస్వామి ఆలయంలో శుక్రవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ మూవీలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు నటించనున్నారు. ధనుష్ తో కలిసి వడివేలు నటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘లబ్బర్‌పందు’ చిత్ర దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఎస్‌జే సూర్య ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ప్రీమార్క్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రారంభం సందర్భంగా హీరో ధనుష్ కరుప్పణస్వామికి 18 అడుగుల కత్తి బహూకరించారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఆలయ ప్రాంగణంలో సినిమా కెమెరాతో షూటింగ్ చేయడం చర్చకు దారితీసింది. ఆలయంలో షూటింగ్ చేసేందుకు సిబ్బంది అడ్డు చెప్పారు. దీంతో ఆలయ సిబ్బంది, చిత్ర యూనిట్ సభ్యుల మధ్య చిన్నవాటి వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి:
ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్
సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్ బ్లోయింగ్ డీల్!
గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్